—————————————-
BUYING AND SELLING
————– ——- —————
( By KAHLIL GIBRAN in “THE PROPHET”)
అనువాదం : Dr.CB.CHANDRA MOHAN
—————————————–
భూమాత తన ఫలాల్ని
లోకులకు సమృధ్ధిగా ఇస్తుంది
మీ చేతులు ఎలా నింపుకోవాలో
మీరు తెలుసుకో వలసి ఉంది!
ఆమె ఇచ్చిన బహుమతులు
మార్పిడి చేసుకునే కిటుకు
తెలిస్తే
‘అందరికీ సమృద్ధి(సమ వృధ్ధి),
సంతుష్టీ’– ఉంటాయి కదా!
ప్రేమతో, దయా, న్యాయాలతోః
ఇచ్చి పుచ్చుకో లేకపోతే’
కొందరు — అత్యాశకు లోనవుతారు!
ఇంకొందరు – – క్షుద్బాధకు గురౌతారు!
విపణి వీధిలో,
మత్స్య కారులు, రైతు సోదరులు,
ద్రాక్ష సారా కార్మికులూ,
— నేతన్నలనూ, కుమ్మరి తమ్ముళ్ళనూ,
సుగంధ ద్రవ్యాల పని వారినీ–కలుస్తారు!
అప్పుడే మీరు
అవని తల్లిని ధ్యానించండి!
ఆమె, ప్రమాణాల పవిత్రతను
కాపాడుతుంది!
గణన చేసి, ప్రతి వస్తువుకూ
సరైన విలువ కడుతుంది!
మీ లావా దేవీల్లో—
‘ఖాళీ చేతులతో వచ్చి,
మాటలతో మీ శ్రమను అమ్ముకునే
దళారులను’
మీ మధ్యకు జొర నీయకండి!
“మాలాగా వ్యవసాయం చేయండి
లేదా
సముద్రంలో వల వేసి చేపలు పట్టండి!
భూ, సాగరాలు రెండూ
అనంత దాతృత్వం
అందరిపై చూపుతాయి!”
అని కుండ బద్దలు కొట్టి చెప్పండి.
గాయకులు, నాట్య కారులు,
వాయిద్య కారులూ
అలరించేది వారి కళల తోనే!
అవి కూడా మారకపు విలువలున్నవే !
వారి కళలు, (కలలతో నిండి ఉన్నా)
మన ఆత్మలకు తిండి, బట్ట
సమకూరుస్తాయి!
విపణి వీధి వదిలే ముందు రిక్త
హస్తాలతో
ఎవరినీ
వెళ్ళ నీయకండి!
ఎందుకంటే,
మీలోని అత్యంత పేదల
అవసరాలు తీరేవరకు,
భూమి తల్లి విశ్రమించదు!
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి “తత్త్వాలు”
Also read: నా లోని నిజం
Also read: “స్వేచ్ఛ”—శృoఖలాలు