శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్ ప్రవచనం
తిరుమల ఒక బృందావనం వలె, శ్రీవిల్ల్లి పుత్తూరై 5 లక్షల మంది గోపికలై, గోపాలురై, ఆడ అనీ మగవారనీ అనుకోకుండా శ్రీకృష్ణుడుతన సింహగమనంతో గంభీరంగా సింహాసనంపై ఠీవిగా కూర్చుకున్నారు. ఆ శ్రీకృష్ణుని సౌందర్యాన్ని చూసి అంతా ఆశ్చర్యంగా, మీకోరికమై అని అడుగుతూ ఉంటే మిగతావన్నీ వదిలేసి కేవలం ఆయనకు మంగళ శాసనం చేయడమే చేయాలనిపించింది. అంటే ఏమిటి? శ్రీకృష్ణుని హాయి కలగాలని, మంచి, శ్రేయస్సు జరగాలనీ మీకు దిష్టి తగలకుండా హారతి ఇవ్వాలని అని నిర్ణయించారు. మనందరికీ మేలు జరగాలని శ్రీకృష్ణుడికి ఆపదలేవీ రాకుండా రక్షించాలని కోరుకుంటున్నాడు, అదే మంగళం పలుకడం. మంగళశాసనం అని ఆరాధనలో ముఖ్యమైన అంశం. భక్తుడైన వాడు తనకు భగవంతుడి రక్షణం కోరుకోవడం ఏమిటి? అదే ఏ విధంగా కీడు జరగకుండా రాక్షసులు హాని రాకూడదని భావిస్తున్నారు. హేతవాదులు ఇదేం పిచ్చి అంటారు. నిజంగా ఇది పిచ్చే, ఆ పిచ్చే భక్తి. భక్తి అంటే ప్రేమ, వల్లమాలిన ప్రేమ, ఇష్టం. సర్వసమర్థుడైన భగవంతుడు, ఆ ఏమిటీ మీరు నాకు రక్షిస్తారా ఆని ఆగ్రహించకుండా, నేనంటే ఎంత ప్రేమ వీరికి అనుకుంటాడు. అనుకోవాలనే అంటాడు. వారికి మాత్రమే అది భక్తి అని తెలుసు. భగవంతుడికి చాలా ఇష్టమైన పనులు చేయాలని, పదార్థాలు తింటారా తినరా, ఏది తింటారు అని లెక్కలు ఉండవు. ప్రేమతో తులసీదళం చాలు అంటారు, గుక్కెడు నీళ్లు ప్రేమతో ఇస్తే చాలటున్నారు. నీవే రక్షకుడని అనే మాటల అనీ అనీ ఎన్నో సార్లు అన్నతరువాత, పాశురాలలో వివరించిన తరువాత, అయ్యో మనమంతా భగవంతుకి రక్ష కడతాం, అంటాడు. తల్లి బిడ్డ కోసం ప్రేమించి నట్టు, ఇష్టపడినట్టు, ఏం చేసినా కోపం వచ్చినాపట్టించుకోకుండా, బతిమాలి కొంతన్నా తినరా బాబూ అని వెంటపడడానికి కారణం ప్రేమే కద. అంటే ఇష్టమే కదా.
Also read: నరసింహుడికే సర్వవ్యాపకత్యం
శ్రీ సీతా రాములు అడవులకు వస్తున్న తెలిసి ఎదురుచూసి తనకు శత్రువులను శిక్షించి తనను రక్షిస్తాడనీ అనుకుంటాడు. ఆ అద్భుతమైన సౌందర్యంతో పరాక్రమంతో కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యానికి గురైపోతారు. ఈ అడవిలో కష్టపడతాడే అనీ, రక్షించమని అడిగితే ఇంకా ఇబ్బంది చేస్తున్నామో అని భయపడి ఏమీ అడగకుండా, రక్షణ అని కూడా అడగకుండా, వారికే హాని రాకూడదనీ ద్రిష్టి తగలకూడదని, హారతి ఇద్దామని, లేదా ఇదో అడుగుదామనుకుండా పూర్తిగా మరిచి పోయి. మునులు వెనక్కి ఆశ్రమాలకు వెళ్లిపోయారట. ఎందుకంటే ప్రేమ, ఇష్టం, భక్తి. మంగళం చేయాలంటున్నారు. మంగళాశాసనం అంటారు.
రామాయణంలో భాగవత మహాభారతాల్లో భక్తులకు మంగళాశాసనలు గురించి ప్రస్తావని ఉంది. ఆ తరువాత అత్యంత భక్తులైన ఆళ్వారులు, ముఖ్యంగా వారిలో పెరియాళ్వారులని పేరున్న విష్ణు చిత్తుడు మొట్టమొదలు మంగళాశాసనం చేసిన వారు.
మూడు లోకాలను కొలిచినపుడు వామనుడికి ఎంత కష్టమైందో, శ్రీ సీతారామలక్ష్మణులు అయోధ్యనుంచి లంక దాకా నడిచి, వారథి కట్టి, రావణుడిని వధించి పడ్డ కష్టాలన్నీ ఎదురైనవి తలచుకుని బాధపడ్డారనీ, మంగళశాసనాలన్నారని, పుట్టినక్షణం నుంచి రాక్షసులంతా చంపడానికి ప్రయత్నాలన్నీ చూసి, కంసుడి వధించదాకా చిన్నవయసులోనే కష్టపడినారే అని మంగళశాసనాలు చేసినారని గోదాదేవి, తన మిత్రులైన గోపాల గోపికలంతా కలిసి, నడిచి, మేలుకొలుపులు చేసి సింహగమనంలో వచ్చి, ఆసనం పై కూర్చుని,గతంలో ఎన్నో సందర్భాలలో పరమాత్ముడు భక్తులకోసం కష్టాలు పడిన సందర్బాలలోఎవరూ మంగళం పాడలేదని, దృష్టి తీయలేదని ఆ లోపాలు తీర్చాలని ఎంతో బాధపడిపోయారు. శ్రీరాముడు రావణ సంహారం చేసిన తరువాత బ్రహ్మరుద్రాదులు వచ్చి నీవే దేవదేవుడి అని చెప్పినా నేను మనుష్యుడనే ప్రకటిస్తూ రాముడిగా మొత్తం అడివంతా నడిచి, అనేకానేక యుధ్దాలుచేసి, రావణుడిని జయించ కష్టపడ్డారని, అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోర్ట్రిశెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోర్ట్రి అంటూ తిరుప్పావై 24వ పాశురంలో గోపికల వారి భక్తి పారవశ్యం, మంగళ శాసనాల గురించి టిటిడి పరిచారిక, వక్త, గాయకుడు, తిరుమల జీయర్ మఠంలో తిరుప్పావై పాశురాలపై శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్ ప్రవచించారు. (https://www.youtube.com/watch?v=ruoAmqajU4s ద్వారా ఆయన ప్రవచనం చూసి వినవచ్చు)
Also read: నాకు మరేదారీ లేదు అంటేనే శరణాగతి