ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరో శివ కంఠంనేని ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఆదిపర్వం యూనిట్
రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్ అమెరికా ఇండియా (ఎ.ఐ) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం “ఆదిపర్వం”. మంచులక్ష్మి ముఖ్యపాత్ర పోషిస్తు న్న “ఆదిపర్వం” చిత్రానికి బహుముఖ ప్రతిభాశాలి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో మంచులక్ష్మి పాత్రకు ఆపోజిట్ గా ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తు న్న శివ కంఠంనేని హీరోగా నటించిన “మధురపూడి గ్రామం అనే నేను” చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్రా నికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఆదిపర్వం లోని శివ కంఠంనేని ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అలాగే ఆదిపర్వంలో క్షేత్రపాలకుడిగా నటించిన శివకంఠంనేని హీరోగా చేసిన “మధురపూడి గ్రామం అనే నేను” చిత్రం విడుదల సందర్బంగా, ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని పొందాలని ఆశిస్తూ విషెస్ చెప్పారు” దర్శకుడు సంజీవ్ మేగోటి. ఆదిపర్వంలో శివకంఠంనేని నటన ఎంతగానో ఆకట్టు కుంటుందని, “మధురపూడి అనే నేను” సినిమాలో పాత్రని చూసి ఆదిపర్వంలో క్షేత్రపాలకుడుగా, శివకంఠంనేని ప్రత్యేక పాత్ర పో షిస్తే బావుంటుందని చెప్పానని, నిజంగా ఆ పాత్రలో శివకంఠంనేని ఒదిగిపోయి చేశారని’ ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఘంటా శ్రీనివాసరావు చెప్పారు.
ఇలా ఉండగా, “అమ్మోరు – అరుంధతి” చిత్రాల తరహా ఈవిల్ పవర్ అండ్ డివోషనల్ పవర్ మధ్య సంఘర్షణ జరిగే పవర్ ఫుల్ మూవీ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పాలి. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ “ఆదిపర్వం.” గ్రా ఫిక్స్ ప్రధానమైన చిత్రంగా మలుస్తు న్న ఈచిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న నాగమ్మ పాత్రలో జీవించింది. అలాగే క్షేత్రపాలకుడిగా నటిస్తు న్న శివ కంఠంనేని కూడా అద్భుతంగా చేశారు. మంచు లక్ష్మికి శివకంఠంనేనికి మధ్య జరిగే ఒక ఫైట్ కి దాదాపు యాభై లక్షలు ఖర్చుపెట్టామని, ఈ ఫైట్ లో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాకి హైలెట్’’ అని దర్శకుడు సంజీవ్ మేగోటి
చెప్పారు.
ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి,హ్యారీజోష్, జబర్ద స్త్ గడ్డం నవీన్, బి.ఎన్.శర్మ, యోగి కాంత్రి, రవిరెడ్డి, వెంకటరామిరెడ్డి, చీరాల రాజేష్, మధు నంబియార్, బృంద, స్నేహ అజిత్, అయేషా, జ్యోతి, శ్రావణి, గూఢా రామకృష్ణ , రాధాకృష్ణ తేలు, ఆర్కే చిల్లూరి, డీఎస్పీ తదితరులు ఆదిపర్వం చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: SN . హరీష్
ఆర్ట్ డైరెక్టర్ : K.VI. రమణ
మ్యూజిక్: మాధవ్ సైబా – ఓపెన్ బనానా ప్రవీణ్ బి. సుల్తా న్ వలి- లుబెక్ లీ – సంజీవ్
లిరిక్స్: సాగర నారాయణ, రాజాపురం శ్రీనాథరెడ్డి,
ఉట్కూరి రంగారావు, రాజ్ కుమార్ సిరా, కె.సి. మల్లికార్జున.
ఎడిటర్: పవన్ శేఖర్
ఫైట్స్ : నటరాజ్
కొరియోగ్రఫీ: సన్ రేస్ మాస్ట ర్
కో డైరెక్టర్ : అక్షయ్ సిరిమల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొ డ్యూసర్: ఘంటా శ్రీనివాస్ రావు
సహనిర్మాత: గోరెంట శ్రా వణి.
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి