మంచిర్యాల: కార్తిక పౌర్ణమి సందర్భంగా మంచిర్యాలలో జరుగుతున్న జాతరకు కుటుంబ సభ్యులతోపాటు వచ్చినటువంటి వాంకిడి మండలం గాడి జనగాం కి చెందిన మౌడ్లే నదిరాం, జీవిత దంపతుల యొక్క 3సంవత్సరాల బాలుడు వారు నదిలో స్నానం చేస్తుండగా జనంలో తపిపోయి దాదపు 2కి.మీ. ఏడ్చుకుంటూ వెళ్లగా అది గమనించిన మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు P. యోవేల్, PC 1757, s. ప్రసాద్, pc3121 లు బాలుడిని దగ్గరకి తీసుకొని అల్పాహారం తినిపించి తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించటం జరిగినది. తప్పిపోయినటువంటి బాలుడిని తిరిగి క్షేమంగా అప్పగించినందుకు బాలుని యొక్క కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు ధన్యవాదములు తెలపటం జరిగిoది..