పోలీస్ కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మరియు సిబ్బందితో కలసి పాత మామిడి పల్లి గ్రామం లో ప్రజలకు మాస్కు ధరించకుండా రోడ్లపై తిరిగే వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ గారు మాట్లాడుతూ సిసి కెమెరాల ఏర్పాటుతో కలిగే లాభాలు, కోవిడ్ నిబంధనలు పాటించాలని, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన, నిరుద్యోగ యువత ఉద్యోగాల సాధన కోసం చేయాల్సిన కృషిపై, ప్రభుత్వ ఆదేశానుసారం కొవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, మరియు బహిరంగ ప్రదేశంలో షాపింగ్ మాల్ లో, కూరగాయల మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్కులు ధరించి, శానిటైజర్ వెంబడి ఉంచుకోవాలని, కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఏసీపీ అఖిల్ మహాజన్ గారు అవగాహన కల్పించారు.
Also Read : భూకబ్జాదారునిపై పీడీ యాక్ట్ అమలు
మాస్కులు లేకుండా కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణా చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట దండేపల్లి ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.