- భూమా మౌనిక విజ్ఞప్తి
- ఆడపిల్లలమని కక్ష సాధిస్తున్నారు
- ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు
- తల్లిదండ్రులు లేరని వేధిస్తారా
- అక్కకు ప్రాణహాని ఉంది
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయిన భూమా అఖిల ప్రియ ఆరోగ్యంపట్ల ఆమె సోదరి భూమా మౌనిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నాప్ కేసులు అక్కను అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన భూమా మౌనిక పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. అఖిలప్రియకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. గాంధీ ఆసుపత్రి నుంచి పోలీసులు తీసుకెళ్లిన విధానం కూడా సరిగాలేదు. జైలులో సరైన వైద్యం అందించడం లేదు. అక్క కళ్లు తిరిగి పడి పోయింది. ఆరోగ్యం బాగోలేదు. హైబీపీ ఉంది. ఫీవర్ గా ఉందని సూపరింటెండెంట్ ఫోన్ చేశారు. ఆరోగ్యం బాగోలేకపోయినా బాగున్నట్లు రికార్డులు చూపిస్తున్నారు. తలనొప్పి మాత్ర ఇచ్చి సరిపెట్టారు. ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు. మాకు ల్యాండ్ ముఖ్యం కాదు. మాకు మా అక్క ముఖ్యం. మా అక్క ప్రాణాలతో తిరిగి రావాలి. అనారోగ్యంతో ఉన్న మహిళకు అన్నం కూడా పెట్టకుండా వేధింపులకు గురిచేస్తున్నారు.
ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు:
పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. పోలీసులు పక్షపాత థోరణితో వ్యవహరిస్తున్నారు. రాత్రికి రాత్రే ఏ 2 గా ఉన్న అక్కను ఏ1 గా మార్చివేశారు. సాక్ష్యాలు తారుమారు చేశారు. జైలులో ఉగ్రవాదులకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని మౌనిక అన్నారు. టెర్రరిస్ట్ లకు అయినా అన్నం పెడతారు కాని మాజీ మంత్రి అయిన అక్కకు అన్నం పెట్టకుండా హింసిస్తున్నారని మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. మేం కొట్టామని ప్రవీణ్ రావు ఆరోపిస్తున్నారు అన్నీ అబద్దాలే. కొడితే మెడికల్ రిపోర్టు ఇవ్వమనండి.పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అక్క ప్రాణాలతో ఉంటుందా లేదా అని మాకు భయంగా ఉంది. మా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు.
తల్లిదండ్రులు లేకపోతే నరకం చూపిస్తారా?
అమ్మా నాన్న చనిపోవడంతో మాకు కష్టాలు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులు లేరని వేధిస్తారా. మేం సంస్కారం లేని వాళ్లం కాదు.. తల్లి దండ్రులు లేకపోవడంతో మా పరిస్థితి దారుణంగా ఉంది. చిన్నవాళ్లం కోర్టులు, కేసుల పేరుతో మమ్మల్ని అందరూ వేధింపులకు గురిచేస్తున్నారు. మా ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేం ఒక్క ప్రాంతానికే చెందిన వాళ్లం కాదు తెలుగు రాష్ట్రాలలో మాకు ఆస్తులు ఉన్నాయి. ఆళ్లగడ్డ కు చెందిన వాళ్లను చులకనభావంతో చూస్తున్నారు. మాది ఆళ్లగడ్డ అయినా పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అని మౌనిక తెలిపారు. సివిల్ వివాదాలు ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. మానవతా విలువలు మరిచి ఆడపిల్లలు అని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మౌనిక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెటిలర్స్ ఓట్లు వేస్తేనే కేసీఆర్ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. సెటిలర్స్ ను రక్షించాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైనే ఉన్నది..
ఇది చదవండి: భూమా అఖిలప్రియ అరెస్టు
పోలీసులపై ఆరోపణలు చేసిన భూమా మౌనిక:
పోలీసులు విధులు నిర్వహించకుండా న్యాయమూర్తులుగా వ్వవహరిస్తూ జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా చెబుతున్నారు. పోలీసులపై ప్రభుత్వం ఒత్తిళ్లు పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రాథమిక హక్కులకు పోలీసులు భంగం కలిగిస్తున్నారు. మమ్మల్ని బ్రతకనివ్వండి వేరే రాష్ట్రం నుంచి వస్తే మమ్మల్ని బ్రతకనివ్వారా అంటూ ప్రశ్నించారు. మాకీ పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. పోలీసులు ఆడపిల్లమీద కక్ష తీర్చుకుంటున్నారు. మేం పాకిస్తాన్ లో ఉంటున్నామా అన్న అనుమానం కలుగుతోంది. చంపేస్తారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ కు మౌనిక విజ్ఞప్తి:
కేసీఆర్ కుటుంబంతో మాకు స్నేహ సంబంధాలు ఉన్నాయని మౌనిక అన్నారు. మా కుటుంబంలో జరిగే వివాహాలకు, శుభకార్యాలకు కేటీఆర్, కవితక్క హాజరయ్యే వారని మౌనిక చెప్పారు. కేసీఆర్ పెద్దరికం చేసి ఆడపిల్లలమైన మమ్మల్ని ఆదుకోవాలని భూమా మౌనిక విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి: గంటకో మలుపు తిరుగుతున్న బోయిన్ పల్లి కిడ్నాప్ ఉదంతం