స్వతంత్రం వచ్చిన కొత్తల్లో 33 కోట్లదేవతలు ఉన్న మనదేశంలొ, కొత్తకొత్త దేవుళ్లు, కొత్తకొత్త దేవతలు పుట్టుకొస్తూనే ఉన్నారు.
కొత్తకొత్త దీక్షలు, కొత్త కొత్తమాలలు ధరిస్తూనే ఉన్నారు.
ఈశతాబ్దంలో పుట్టుకొచ్చిన క్రొత్త దేవుళ్లు అయ్యప్ప, సాయిబాబాలుగా చెప్పుకోవచ్చు.
ఈ అయ్యప్పలుగాని, సాయిబాబాలుగాని ఒక 50 సంవత్సరాలక్రితం ఇంతగాలేరు.
Also read: ఆంద్రా యూనివర్సిటీలో జ్యోతిష్యం కోర్సా?
ఎక్కడో ఒకరు అయ్యప్ప, సాయిబాబా అనుకునేవారు.
మరి సైన్సు పెరిగేకొద్ది ఇలాంటి అశాస్త్రీయ భావాలు తగ్గిపోవాలి.
కానీ దినదినం అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.
పురాణాలలో ఈ అయ్యప్ప గురించి ఎక్కడాలేదు. ఋగ్వేదంలో లేదు.
Also read: చేవూరి దొంగస్వామి నుంచి చెరువు పోరంబోకు తక్షణమే స్వాదీనం: వెంకటసుబ్బయ్య విజ్ఞప్తి
పురాణాలన్నీ భౌద్దాన్ని నాశనం చేసేందుకు క్రీపూ .200 నుండి క్రీశ .1500 వరకు రచించారు. ఈమద్యలోనే వైష్ణవులు, శైవులు తన్నుకచచ్చారు. తలలు నరుక్కున్నారు. విష్ణు పక్షి ……వాహనమెక్కెను అని శైవులు అంటే, శివుఁడు ఎద్దు …….వాహనమెక్కెను అని వైష్ణవులు ఒకరినొకరు తిట్టి పోసుకున్నారు.
ఆక్రమములోనే పాలసముద్రములో పామును తాడుగాచేసుకొని, కొండను చిలుకుతుంటే చివరిలో విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి, అమృతాన్ని దేవతలకు పంచి (దేవతలు దేవలోకంలో ఉంటారుగదా, భూలోకంలో వారికేమిపని ?) తిరిగి వెళ్లే క్రమంలో, ఆకాశంలో విహరిస్తున్న మోహినిని శివుఁడు చూసి మోహిస్తాడు.
Also read: మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును”
ఆమొహిని విష్ణు అని శివునికి తెలియదా?
ఆఇద్దరికి పుట్టినవాడే ఈ అయ్యప్ప అని వారి గ్రంధాలలోనే వ్రాసుకున్నారు.
మరి అలాంటి అయ్యప్ప అనుగ్రహం కోసం ఈరొజు తెలుగుప్రజలు ఎక్కువశాతం కేరళ వెళ్తున్నారు. మా చిన్నపుడు ఈఅయ్యప్ప వేషం వేసినవారిని గ్రామీణప్రజలు ఎగతాళి చేసేవారు. మరి అలాంటిది ఈరొజు ఎగబడి వెళ్తున్నారు.
“అందుగలదిండు లేదను సందేహము వలదు, ఎందెందువెదకినా..” హరియున్నాడని పోతన చెప్పాడుకదా, మరి దేవుళ్లను చూడటానికి గుళ్ళకే ఎందుకువెళ్లాలి అని ఎవరయినా ఆలోచించారా?
హేతువాద పితామహుడు తాపీ ధర్మారావు గారు చిన్నపుడు పడుకొని చదువుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ ” ఓరే కాళ్ళు దేవుడి పటం కెళ్ళి ఉన్నాయి తియ్యి ” అని అనగా వెంటనె దేవుడు సర్వాంతర యామి అని నువ్వేచెప్పావు కదా, కాళ్ళు ఎటుపెట్టినా అన్నివైపులా దేవుడు ఉన్నదుకదా అని ప్రశ్నిస్తాడు.
అలాంటి ప్రశ్నలు కావాలి ఈరొజు.
Also read: హైకోర్టుతీర్పు అభినందనీయం, ప్రభుత్వానికి చెంపపెట్టు
కొన్నిసంవత్సరాలక్రితం అయ్యప్ప మకరజ్యోతి దర్శించటానికి వెళ్లిన భక్తులు అక్కడ జరిగిన తోక్కిసలాటలో మనతెలుగువారే 54 మంది చనిపోయిన విషయాన్ని గురుతు చేసుకోవాలి .
గుడికి 5, 6 కిలోమీటర్ల దూరంలో పొన్నంబెడు కొండమీద అయ్యప్ప జ్యోతిరూపంలో కనిపిస్తాడన్న ప్రచారంతో భక్తులు విశేషంగా వెళతారు. వాస్తవానికి గుడికమిటీవారు, కరెంటు శాఖవారు కలసి చీకటిపడిన తరువత ఆకొండమీద పెద్దపళ్లెంలో కర్పురం వెలిగించి అటుఇటు తిప్పుతారు.
గుడిలో మైకులో కామెంట్ చెప్పెవారు అడిగో దేవుడు దర్శనం ఇస్తున్నాడని చెప్తారు.
ఈవిషయాణ్ణి అక్కడి హేతువాదులు ఎనాడో బయటపెట్టారు.
ఒకసారి జ్యొతి దర్శనం అయిన తరువాత అక్కడికి కొంచెందూరంలొ హేతువాదసంఘంవారు కూడా అదే మాదిరి వెలిగించారు.
మైకులో చెప్పేవారికి అర్ధంగాక దేవుడు మరల మరల దర్శనం ఇస్తున్నాడని చెప్పుకున్నారు.
అయితే కేరళ హేతువాదులు ఈమోసాన్ని నిగ్గుతేల్చేందుకు హైకొర్టులో కేసువెయ్యగా, గుడికమిటివారూ, దేవదాయ శాఖవారూ వాస్తవాన్ని వొప్పుకొని, ప్రభుత్వ ఆదాయంకోసం అయ్యప్పజ్యోతిని వెలిగిస్తున్నాము అని సంయుక్తంగా కోర్టులో అంగీకరించారు.
కనుక ప్రభుత్వాలు ఈవాస్తవాన్ని ప్రజలకు చెప్పవలసి అవసరం ఉంది.
మకరజ్యోతి మానవకల్పితమే!
Also read: ఆం.ప్ర. ముఖ్యమంత్రి ప్రకటనలు కేవలం ఉడత ఉపులేనా?
నార్నెవెంకటసుబ్బయ్య