బుధవారం నాడు పుట్టపర్తిలో భగవాన్ సత్య సాయి 97వ జన్మదిన వేడుకలను లక్షలాది భక్తులు వీక్షిస్తుండగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, సత్యాసాయి ట్రస్టు ముఖ్యులు రత్నాకర్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గీతారెడ్డి, తదితర పెద్దల సమక్షంలో బాబాకి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి మహాత్మ అక్కినేని మహాహారతి ఇచ్చారు. స్వామి జన్మదినం రోజునే 16 ఏళ్ళ కిందట పుట్టిన చిరంజీవి మహాత్మకు బుధవారంనాడు 17వ ఏట అడుగుపెట్టాడు.
ప్రతిభావంతుడైన మహాత్మ రంగస్థల నటుడుగా, పినీ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అనేక అవార్డులు తెచ్చుకున్నారు. శ్రీ సత్యాసాయి విద్యాసంస్థల పెద్దలు ఈ సారి మహాహారతి ఇచ్చేఅవకాశం సత్యసాయి కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మహాత్మకు ఇవ్వడం విశేషమనీ, అతనికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాననీ చెబుతూ సత్యసాయి జిల్లా డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ నాయక్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.
మహాత్మా తండ్రి శ్రీధర్ అక్కినేని సినియర్ జర్నలిస్టు. తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ, ‘మొలక’ అనే పత్రిక సహనిర్వాహకులు. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యంలో రంధ్రాన్వేషణతో కూడిన పాత్రికేయ వృత్తిలో ఉన్న తనకు పుట్టపర్తి బాబా పట్ల మొదట్లో విముఖత ఉండేదనీ, బాబా పుట్టినరోజే పుట్టిన కుమారుడికి మహాత్మ అని పేరు పెట్టామనీ శ్రీదర్ తెలిపారు. పుట్టపర్తి కాలేజిలో ఇంటర్ ప్రవేశానికి 1500మంది విద్యార్థులు ఎంట్రెన్స్ పరీక్షకు హాజరవుతే 80 మందిని ఎంపిక చేశారనీ, ఎంపీసీ గ్రూప్ కి సెలక్ట్ అయిన 40 మందిలో ఎనిమిదవ ర్యాంకు మహత్మకుు వచ్చిందనీ ఆయన తెలియజేశారు. ఆధ్యాత్మిక, సంక్షేమ కేంద్రంగా విలసిల్లుతున్న పుట్టపర్తి బాబా మందిర నిర్మాణం అద్భుతమని ఆయన అన్నారు. పుట్టపర్తి వెళ్ళే ముందు పెద్దల ఆశీస్సులు మహాత్మ అందుకున్నారు.
నా మహాత్మని ‘ సకలం ‘ద్వారా ఆశీర్వదించిన నా మీడియా లైఫ్ గాడ్ ఫాదర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారికి హృదయపూర్వక కృతఙ్ఞతా నమస్సులు.
– లయన్ శ్రీధర్ అక్కినేని.
( ఆర్టిస్ట్’ – జర్నలిస్ట్ )