భారతీయ ఆంగ్ల కవులు-11
మహతి కలం పేరుతొ రచనలు చేసే ఎం వి సత్యనారాయణ అనేక సుప్రసిద్ధ రచనలు చేశారు. హిందూ ధార్మిక గ్రందాల ఆధారంగా గ్రంధాలు, సుదీర్ఘ కవితలు రాశారు. రామాయణంలోని సుందరకాండ ఆధారంగా ఫైండింగ్ ది మదర్ లో హనుమంతుడు లంకకు వెళ్లి సీతను వెదకడం ఇతివృత్తం. మాతృకలోని సౌoదర్యాన్ని ఆంగ్లంలోకి తీసుకురాగలగడం దీని పత్యేకత. ఇందులో శైలి సందర్భోచితంగా మిల్టన్ శైలిలా నారికేళ పాకం. గరికపాటి నరసింహారావుగారి రచనకు తన స్వేచ్చానువాదమైన ఓషన్ బ్లూస్ లో ఒక అలతో అనేక విషయాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తారు. చoదస్సుపై తన పట్టును తెలియజేస్తుంది ఈ రచన. మరో రచన హరే కృష్ణ ఈయన భక్తికి నిదర్శనం. మరొక దీర్ఘ కవిత ది గాంజెస్ దివినుండి భువికి దిగిన గంగావతరణం గురించి. పై రెండిట్లోనూ శైలి కొంత సరళంగా ఉంటుంది. ఆదునిక కవిత్వ లక్షణాలైన ప్రతీకలు, సంకేతాలు, నర్మగర్భ పద ప్రయోగం ఈయన ఇతర రచనల్లోనూ కనిపిస్తాయి.
Also read: అన్నపూర్ణ శర్మ
Also read: రేష్మా రమేష్
Also read: త్రిషాని దోషి
Also read: అరుంధతీ సుబ్రహ్మణ్యం
Also read: జీత్ తాయిల్
Also read: శివ్ కె కుమార్
Also read: కేకి దారూవాలా
Also read: జయంత్ మహాపాత్ర
Also read: నిస్సిం ఎజేకియల్
Also read: ఎకె రామానుజం