దాపురించిందో మహమ్మారి
మునుపెన్నడూ ఎరగని భయోత్పాతం కలిగిస్తూంది
ప్రపంచాన్ని గడగడ లాడిస్తూంది
మృత్యు దేవతతో కరాళ నృత్యం చేయిస్తూంది.
వడిగాలులు, జడివానలు, ఉరుములు, మెరుపులు,
పిడుగులు, ఉప్పెనలు, భూకంపాలు చూశాం
కంటికి కనిపించని కరోనా క్రిమి
విలయ తాండవం నేడే చూస్తున్నాం
మందులేని వ్యాధిని
తప్పించుకునే మార్గం లేక
తప్పుకుని ఉంటున్నాం
ఇల్లే జైలుగా నిలిచి పోయాం
శుచిగా ఉంటుంన్నాం
చేతులు పదేపదే కడుక్కుంటుంన్నాం
చేసిన పాపాలన్నీ పోయేటట్లుగా.
ఇంత ఉత్పాతానికి మూలం వికృత జీవన శైలి
జీవ కారుణ్యం మరచి పాములు, గబ్బిలాలు కూడా తినే మనుషులు.
కుల మత, పేద ధనిక తేడాలు వదలి
మంచి చెడు విచక్షణ కలిగిన మనుషుల్లా
ప్రకృతి సహజ మార్గంలో
ఆనందంగా పయనిద్దాం
ప్రస్తుతానికి సామాజిక దూరాన్ని తప్పకుండా పాటిద్దాం.
మూలాలు గుర్తించి మానవ జాతి వర్ధిల్లేలా చూద్దాం.
జాతిని కాపాడే ప్రయత్నంలో ఉన్న ప్రజాసేవకులకు నమస్కరిద్దాం.
Also read: “గుడిపాటి వెంకట చలం – అధివాస్తవికత”
Also read: చర్యా పదాలు – ఒక పరిశీలన
Also read: ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు
Also read: కవిత్వమంటే……
Also read: కొంతమంది సమకాలీన భారతీయ ఆంగ్లకవుల కవితల పర్యావలోకనం