మనువు ధర్మం చెప్పాడు.
రుషులు భూతదయ అన్నారు.
శంకరాచార్యుడు దేవుడు ఒక్కడే అన్నాడు
క్రీస్తు ప్రేమ అన్నాడు
బుద్ధుడు అహింస అన్నాడు
పురాణ పురుషులు
గాంధి మాత్రమే పాటించారు.
వారి వారసులం మనం
నిజంగా వారసులమేనా
మరెందుకు కులం కొట్లాటలు
మతం కుమ్ములాటలు
ప్రాంతాల యుద్ధాలు
పార్టీల పేరున కుతంత్రాలు
అధికారం కోసం కుట్రలు.
అంతమయ్యే జీవితాల్లో
అనంత ఆశలు
ఆరోగ్యం, కుటుంబం, సంతోషం మరచి
సంపాదనే లక్ష్యంగా
ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో
ఆలోచన లేకుండా
ఎందరినో దోచి దాచుకోవడం
పోయేటప్పుడు వెంట రాదని తెలిసినా
వదలని మోహం
దానితో ఈర్ష్య, ద్వేషం, వైషమ్యం.
పిల్లల కోసం అంటారు
వాళ్లు సంపాదించుకోలేరనే మూర్ఖత్వం
ఎప్పుడు బయట పడతాం ఈ యావ నుండి?
Also read: “తపన”
Also read: “యుగాది”
Also read: “మునక”
Also read: ‘ఆ గురువు లెక్కడ’
Also read: “స్కూలీ”