Tuesday, January 21, 2025

భోగలాలసత దుఃఖకారకం

భగవద్గీత96

Lifestyle disorders. ఈ మాట మనం చాలా ఎక్కువగా వింటున్నాం. మనకొచ్చే రోగాలు సింహభాగం ఈ lifestyle disorders వల్లనే. What is present day life style? ఈ ప్రశ్న వేసుకుంటే మనకు చాలా తేలికగా సమాధానం దొరుకుతుంది.

ఉదయం లేచిన దగ్గరనుండి ఒక్కసారి ఏం చేస్తున్నామో ఆలోచించండి. తియ్యటి పేష్టు ప్లాస్టిక్‌ బ్రష్షుమీద వేసుకొని ముఖప్రక్షాళన. ఆ తరువాత తియ్యని కాఫీనో, టీనో తాగి పేపరుచూసి ఆ తరువాత కడుపునిండా టిఫినుచేసో, భోజనంచేసో మోటారుసైకిలో, కారో, బస్సో ఎక్కి ఆఫీసుకెళ్ళి గంటగంటకూ టీ తాగి మధ్యాహ్నం భోంచేసి మళ్ళా టీలు తాగుతూ కుర్చీలోనుండి లేవకుండా పనిచేసి అయిదు దాటిన తరువాత ఇంటికివచ్చి టీవి రిమోటు తిప్పుతూ దానిముందు కూర్చుని భోజనంచేసి మెత్తటి పరపుమీద వెంటనే పడుకొని నిద్రపట్టక అటుఇటుపొర్లి ఎప్పటికో కునుకుతీసి మళ్ళా తెల్లారిలేచి… ఇదే దినచర్య!

Also read: మనలను ఆవరించిన మాయ

ఒక సామాన్యుడికి ఏ అలవాట్లు లేనివాడికి? ‘వాడికి ఏ అలవాటు లేదండీ అయినా పాడు రోగాలు చుట్టుముట్టాయి’ అని అనటం మనం వింటున్నాం. ఇంకా extra అలవాట్లున్నవాడి సంగతి చెప్పనే అక్కరలేదు.

శరీరానికి వ్యాయామం లేదు. తిండిమీద అదుపులేదు. అంతా సుఖవంతంగా జరిగిపోవాలి. ఇది మన కోరిక.

ఏమిటి సుఖం? వేటికి సుఖం?

మన ఇంద్రియాలకు, చర్మానికి AC గాలులు, ఇతర సౌఖ్యాలు. నాలిక కోరిన రుచులు, కాలు కదలకుండా రవాణాసౌకర్యాలు. కన్ను అలసిపోతున్నా సెల్ఫోనులో ప్రపంచవీక్షణం. చెవి కర్ణభేరి పగిలిపోయే శబ్దాలు. Posture వలన నొప్పులొస్తాయి అని చెప్పినా వినకుండా పరుపులమీద నిద్రలు. అంతే లేదు చర్చించుకుంటూ పోతే.

షుగరు, బిపి, పళ్ళ సమస్య, కళ్ళు పొడిబారిపోవడం. ఒకటా రెండా? చాంతాడంత లిష్టుతో రోగాలు. ఇవ్వన్నీ Life style disorders. మనం నాగరికత పేరుతో జీవితాన్ని సంక్లిష్టం చేసుకున్నాం (We have made our life complicated. ఇవన్నీ విషయభోగాలు.

Also read: భక్త సులభుడు భోళాశంకరుడు

యే హి సంస్పర్శజాభోగా దుః

ఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః

కౌంతేయ న తేషు రమతే బుధః !

విషయభోగాలు భోగలాలసులకు సుఖముగా అనిపించినప్పటికీ అవి సందేహము లేకుండా దుఃఖమునకు కారణములు. వివేకమున్నవాడు వాటియందు ఆసక్తుడు కాడు. కాస్త మన జీవితాన్ని కొంచెం వివేకంతో గడుపుదాం.

Also read: జీవితం  ఎట్లా వస్తే అట్లా స్వీకరించాలి

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles