ప్రాణులన్నీ తమ పిల్లలను సంరక్షిస్తాయి
మనుషులకే కావాలి శ్రావణ కుమారుడు
రాముడు, కృష్ణుడు వద్దు
వాళ్ళు ధర్మ రక్షణ అంటూ
తల్లిదండ్రులను పట్టించుకోలేదు.
నేడు పిల్లలను దూరంగా ఉంచేస్తున్నారు
పెద్దల విలాసాలకు వీలు కాదని కొందరు
వాళ్ల అల్లరి నియంత్రించ లేక కొందరు
పెంపకం చేతకాక కొందరు
బడులు, హాస్టళ్లు, ట్యూషన్లు అంటూ
బయటికి పంపేస్తున్నారు
బాగా చదివి విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారు.
పిల్లలు నిద్ర లేచినప్పటినుండి పరుగులు
పుస్తకాల బస్తాలు మోసుకుంటూ బడికి
ఆ తర్వాత ర్యాంకుల కోసం ట్యూషన్లకు
సాయంత్రానికి నీరసంగా అరచేతిలోని ఫోన్లోనే ఆటలు.
ఉద్యోగం చేసే అమ్మకు లాలి పాటలు రావు
గోరు ముద్దలు, తండ్రితో షికార్లు,
అమ్మమ్మ కథలు అనుభవం లేదు
కాని స్కూల్లో మానవ సంబంధాల మీద
వ్యాస రచన పోటీ పెట్టారు
పెద్దల స్వార్ధం, డబ్బుపై ప్రేమ, ప్రపంచీకరణ
ప్రస్తుత దౌర్భాగ్యానికి కారణాలని ఎవరూ చెప్పరు వాళ్ళకు.
అసలు పురాణాల్లోనే శ్రావణుడు తప్పబుట్టాడు
శంతనుడు, హరిశ్చంద్రుడు, దశరధుడు, దుష్యంతుడు
తమ స్వార్ధమే చూసుకున్న తండ్రులు
ఆ పరంపర కారణంగానే నేడు పిల్లలు విదేశాల్లో
పెద్దలు వృద్ధాశ్రమాల్లో
ప్రేమ వన్ వే కాదుగా!
Also read: రాజ్యాంగం
Also read: “దీపావళి”
Also read: “సింధువు”
Also read: “హంతకులు”
Also read: నా మాట