(నిశి దిన ప్రేమ)
(కీర్తిశేషులు) తణుకు సూర్య వెంకటరత్నం
నిశి చిన్నది
నల్ల సిగ దువ్వింది
మల్లె తారల పరచింది
వేచి వేచి చూస్తోంది
మండు వెన్నెల కురుస్తోంది.
దినుడు
మిరుమిట్లు కంటితో
నింగి నీలి కండువా నీడగా
ఎల్లెడా చూస్తాడు
గాడ్పు టూర్పుల ఓడుతాడు
మండుటెండ వాడుతాడు.
ప్రపంచం పుట్టిననాడు
పుట్టిన ప్రేమ నిశిదినులది
ప్రపంచం గిట్టిన నాడు గాని
ఫలించని ప్రేమ నిశిదినులది
నిశిదినుల ప్రేమ ఫలించినగాని
గిట్టనట్టి ప్రపంచమిది.
రేయిం బవళ్ళ ప్రేమ
రేయిం-బవళ్ళ ప్రేమ
అనాది ప్రేమ – యుగాది ప్రేమ
ముడులోకాలలేని ప్రేమ
మూడు కాలాలలోని ప్రేమ.
రెండర్ధ గోళాలు
ప్రేమికుల గందర గోళాలు
పుర్వాన నిశి దినుని వెదికి
వేసారి ప్రొక్కుకు దిరుగు
నందాక ప్రొక్కున నిశినిని జూసి
అప్పుడే తూర్పుకు దినుడు జను.
Also read: “హరే కృష్ణ” – సమీక్ష
Also read: లాజిక్
Also read: “తెలుగు”
Also read: “మానవ జీవితంలో భగవద్గీత”
Also read: “జీవితం ఎందుకు?”