ప్రియా, ఇలా రావూ
ఉన్నావా, ఎక్కడున్నావు
ఆనాడు
ఆ ఆకాల మహిషం నన్ను కుమ్మినపుడు
నా కాలం ఆగిపోయింది.
ఎప్పటి నుంచి నీ కోసం నిరీక్షిస్తున్నానో
ఎంత గాఢంగా కాంక్షిస్తున్నానో
నీకైనా తెలుసా?
నీకు తెలుసట. చాలామంది చెప్పారు.
నీవు హృదయాంతర్గామివటకదా.
సుఖం దుఖంలేని ఈ సుషుప్తికి
చైతన్యానికి బంధం వెంట్రుక.
ఓహ్ నీ కురులు ఎంత అందంగా ఉన్నాయ్
కానిమెడను పూర్తిగా కప్పేశాయ్.
మొన్న నాకు కలొచ్చింది
శివాలయానికి వెళ్లాను
పక్వానికి రాలేదనుకున్నాడేమో
లోపలికి వెళ్ళనివ్వకుండా
గణేశుడు ప్రసాదం పెట్టి తరిమేశాడు
Also read: స్కూలీ
Also read: వెన్నెముక లేని మనిషి
Also read: మూడో కన్ను
Also read: యవ్వనం
Also read: విధి విలాసం