* అవన్నీ పెద్దలు మెచ్చిన పెళ్లిళ్లు కావు
* యుద్దాలతో వనితలను చేబట్టిన యోధుడు
* కృష్ణ లీలలు అన్నీ తత్వబోధనా తన్మయత్వాలు
ఒక్క భార్య ఉంటేనే వేగలేకపోతున్నామని….ఇక ఇద్దరు భార్యలు ఉంటే వారిద్దరి మధ్య చిక్కి శల్యమై గుండె పోటు తో గుటుక్కుమన్నా చూసే నాథుడే కరువవుతున్న ఈ రోజుల్లో ద్వాపర యుగంలో అష్టభార్యలతో పాటు పదహారు వేల మంది గోపికలతో సరసాలు, ఇటు రాజ్యపాలన చేస్తూ, మహాభారత యుద్ధంలో కీలక పాత్ర పోషించి, ద్రౌపదివస్త్రాపహరణాన్ని ఆపి ద్రౌపదికి మంచి అన్నయ్య గా, యశోద, దేవకీకి మంచి పుత్రుడిగా, బలరామునికి మంచి తమ్మునిగా, అష్ట మహిషలకు మంచి భర్తగా కీర్తించబడ్డ శ్రీకృష్ణుడు… “పరమాత్మ” గా అవతరించడం వెనుక ఎంతో తత్వ బోధనా తన్మయత్వాలు ఉన్నాయి!
ఇష్టమైన అష్టభార్యలు
అసలే ఇష్టమైన అష్ట భార్యలు ఒకొక్కరికి ఒక్కో అంతఃపురం! పరిచారికలు…అయినా శ్రీకృష్ణుని పట్టమహిషి అయిన రుక్మిణికి మాత్రమే ద్వారక ప్రజలు ఇచ్చే విలువ వేరు. ఎలాంటి యజ్ఞ యాగాదులు అయినా హ కృష్ణుడి పెద్ద భార్యగా రుక్మిణికే అర్హత ఉండేది! అయితే ఒక సారి నారదుడు అష్ట భార్యల్లో “ఎవరంటే మీకు ఇష్టం కాదో మాకు ఇవ్వండి” వారిని కూతురురిలా చూసుకుంటాను అంటాడు! కృష్ణుడు చిరునవ్వు నవ్వి “నేనంటే ఇష్టం లేదని చెప్పే ఎవరినైనా మీరు తీసుకు వెళ్ళండి” అంటాడు! ఆ మాట నారదుడు ఎనిమిది మందిని అడిగిన వెంటనే వారు తమ భాషల్లో తిట్టిన తిట్టకుండా నారదున్ని తిడతారు! ‘ఈ భర్త పిచ్చి ఏమిటా?” అని నారదుడు తన దివ్య దృష్టితో చూస్తాడు!
Also Read : సంతృప్తి లేని జీవితమే అనర్థాలకు మూలం
నారదుని పరిశీలన
సత్యభామ కృష్ణుడికి ఇష్టం ఆమె దగ్గర ఉంటాడు అనుకుంటాడు! కానీ ఆమె కంటే ఇష్ట మైన భార్య జాంబవతి అని ఆయనకు తెలుస్తుంది…తల్లి దండ్రులు అడవిలో వదిలి వెళ్ళిన అనాధ శిశువు జాంబవతి! ఆమెను జాంబవంతుడు పెంచుతాడు! ఆమె తల్లి లేని పిల్ల అని శ్రీకృష్ణుడికి మమకారం! అలా అందరూ శ్రీకృషుణ్ణి తలుచుకోవడం వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆమె కోరిక తీర్చడం చూసి నారదుడు “నారాయణ నువ్వు సర్వాంతర్యామివయ్యా” అని లెంపలు వేసుకుంటాడు!! ఇలా అష్ట భార్యల్ని ఎలా కృష్ణుడి చేపట్టాడో వారికి ప్రేమను ఎలా పంచాడో తెలుసుకుందాం.
విలక్షణమైన లక్ష్మణ
శ్రీకృషుని భార్యాల్లో లక్ష్మణది విశిష్ట శైలి! ఈమె వీణ బాగా వాయిస్తుంది.. మంచి అందగత్తె! ఈమెను దుర్యోధనుడు, జరాసంధుడు కూడా మోహిస్తుంటారు…మాద్రి రాజు బృహతసేన కూతురు ఈమె! ఆమెను తమ కిచ్చి పెళ్లిచేయకుంటే రాజ్యం పై దండ యాత్ర చేస్తామని హెచ్చరిస్తారు కౌరవ రాజులు! ఈ విషయం శ్రీకృష్ణుని కి తెలిసేలా చేస్తుంది లక్ష్మణ!
తండ్రి కి స్వయంవరం ఏర్పాటు చేయమని చెప్పి మత్స్య యంత్రాన్ని కూడా ఏర్పాటు చేయమని చెబుతుంది…పాండవులు కృష్ణుని పక్షాన ఈ స్వయంవరానికి రానని స్వామి భక్తిని ప్రకటిస్తారు! ఆ స్వయం వరానికి వచ్చిన కృష్ణుడు మత్య యంత్రాన్ని ఛేదించి ఎదురు వచ్చిన రాజులను చెల్లా చెదురు చేసి లక్ష్మణను పెళ్లి చేసుకుంటాడని విష్ణు పురాణంలో లక్ష్మణ కథ ఉంటుంది…ఇక కాళింది యమునా తీరంలో ఉన్న అందగత్తె. తండ్రి సూర్యుడు! కృష్ణ గాధలు విని ఆయనను ప్రేమించింది… ఒక రోజు వేటకు వెళ్లిన కృష్ణార్జునులకు కాళింది కనబడి కృష్ణునికి ప్రేమ వ్యక్తం చేస్తుంది…తరువాత ఇంద్రప్రస్థానికి ఆమెను తీసుకు వెళ్లి కృష్ణుడు కాళిందిని పెళ్లి చేసుకుంటాడు!
Also Read : పరిపూర్ణమైన వ్యక్తిత్వ సిద్ధాంతం కృష్ణతత్వం!
నాగ్నజితికోసం మదపుటెద్దులతో పోరాటం
మరో భార్య నాగ్నజితి. ఆమె తండ్రి కోసల రాజు. ఆ రాజ్యంలో ఏడు మదపుటెద్దులు రాజ్యం మీద పడి బీభత్సం సృష్టిస్తుంటాయి. ఆ ఎద్దుల మదం అణిచిన వారికి తన కూతురును ఇచ్చి వివాహం చేస్తానంటాడు నాగ్న జిత్తు తండ్రి…ఏడు ఎద్దులను గుద్దులతో వేధించి తాళ్ళతో కట్టేసి నాగ్నజిత్తును పెళ్లాడుతాడు కృష్ణుడు. కృష్ణుడికి మేన మరదలు అయిన భద్రాదేవీ కృష్ణునికి స్వయంగా మేనత్త కూతురు.
భద్రాదేవి పరిణయం
మేనత్తలు తప్పా వారి కుటుంబ సభ్యులు అందరూ కౌరవ పక్షమే. బావ అంటే ఇష్టపడ్డా కూడా భద్ర పెళ్లిని ఆమె సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కేకయ దేశం రాజు కూతురు అయిన భద్ర ఎంతో అందగత్తె…కృష్ణుడిని తరచుగా శుభకార్యాలలో కలిసే భద్ర అంటే కృష్ణుడికి గౌరవమట. ఈ విషయాన్ని మరో మేనత్త కుంతి పసిగట్టి భద్ర తల్లి శ్రుతకీర్తిని ఒప్పించి పెళ్లి చేసిందని, భద్రా కల్యాణం చెబుతోంది.
ఈ పుస్తకాన్ని తెలుగు భాషలో డాక్టర్ కె.వి.కృష్ణకుమారి రాశారు. ఆమె తన 80 వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి బాబాకు ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. ఈ పుస్తకంలో, ఆమె భద్రను మహాలక్ష్మి (విష్ణు భార్య) గా మరియు కృష్ణుడితో తన వివాహం తన ఏడవ భార్యగా “అందం, భక్తి, ప్రేమ సంగమం” గా అభివర్ణించింది!
మిత్రవింద కథ
కృష్ణుని భార్యల్లో మిత్రవింద మరొకరు! ఈమె కృష్ణుని మరో మేనత్త రాధాదేవి కూతురు. అవంతి రాజ్యానికి చెందిన జయసేన రాజు తన కూతురు మిత్రవిందకు కృష్ణుడితో పెళ్లి చేయడం ఇష్టం లేదు. కౌరవ రాజులకు ఇద్దామని స్వయం వరం ప్రకటిస్తారు…ఇంతలో మిత్రవింద కృష్ణుని సోదరి సుభద్ర ద్వారా కృష్ణునికి కబురు చేసింది. మిత్రవింద సోదరులతో భీకర యుద్ధం చేసి మిత్రవిందను ఎత్తుకు పోయి ద్వారక లో తన బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటాడు! ఇక జాంబవతి ఈమె పెంపుడు తండ్రి జాంబవంతుడు కృష్ణుడు అంటే మంట. జాంబవంతుడిది రెండు యుగాల చరిత్ర. తన కూతురును అపహరించడానికి వచ్చిన కృష్ణుడితో 28 రోజుల యుద్ధం చేసి జాంబవతిని ఎత్తుకెళ్ళి కృష్ణుడు వివాహం చేసుకుంటాడు. చివరగా రుక్మిణీ సత్యభామ. కృషుడితో ఎప్పుడు అలిగి సాధించుకునే సత్యభామ మిగతా సవతులు అంటే అసలు పడకపోయేది!
Also Read : కృష్ణతత్వమే మానవ జీవిత సారాంశం
సఖ్యత కరువు
ద్వారకలో శుభకార్యాలు అయినా కూడా మిగతా ఆరుగురు సవతులతో సఖ్యంగా ఉన్న దాఖలాలు లేవు. అయితే రుక్మిణీ అంటే మాత్రం సత్యకు గౌరవం, ప్రేమ, భయం. సత్యభామ సత్రాజితు కూతురు…సత్య ను కృతవర్మ బంధువులు మోహించి పెళ్ళాడలని విశ్వప్రయత్నం చేస్తుంటారు…ఈలోపు శ్యమంతకమను మణిని ఒక పులి అపహరించుకుపోవడం, కృష్ణుడే ఆ మణి ని అపహరించడని సత్రాజిత్తు అపోహ పడడం, ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. చివరికి మణిని కృష్ణుడు దొంగలించలేదని తెలిసి. తన పై పడ్డ మచ్చను తొలగించుకొని చివరకు మణి ని సత్రాజిత్తుకు అందజేస్తాడు కృష్ణుడు. మణితో పాటు సత్య ను వరిస్తాడు కృష్ణుడు.
రుక్మిణి లక్ష్మీదేవి అవతారం
ఇక పట్టపురాణి రుక్మిణి. ఈమె సాక్షాత్తు లక్ష్మి దేవి అవతారం. విదర్భరాజు భీష్మకుని కుమార్తె రుక్మిణీ…ఈమెకు ఐదుగురు సోదరులు. వీరందరికీ కృష్ణుడు అంటే పడదు. రుక్మిణీని శిశు పాలుడికి ఇచ్చి చేద్దామని వారికోరిక. ఆ మేరకు నిశ్చితార్ధం కోసం సన్నాహాలు జరుగుతుండగా గౌరీ పూజ కోసం ఉరి బయటకు వచ్చిన రుక్మిణిని కృష్ణుడు తన రథం పై అపరించుకు వెళ్తాడు. అప్పుడు భీకర పోరాటం జరుగుతుంది…చివరకు రుక్మిణీ ని ద్వారకలో ఘనంగా పెళ్లి చేసుకుంటాడు కృష్ణుడు! కట్టుకున్న వాళ్ళు అందరూ కృష్ణుడిని ఇష్ట పడ్డా వారిని కళ్యాణం మాత్రం పొరాటలతో ఆరాటలతో చేసుకుని ఒకొక్కరికి పది మంది పిల్లలను కన్న కృష్ణుడి రాసలీలలు విచిత్రంగా వినసొంపుగా ఉంటాయి!
Also Read : అమ్మ జోల పాటలో ఉన్న నిద్ర ఇప్పుడేది?