పాద యాత్ర లన్నీ
అధికార ప్రస్థానానికి తీర్ధ యాత్రలే
పేరుకి ప్రజాస్వా మ్యమే
అంతర్లీనంగా సాగేది
వారసత్వమే!
ఎన్నికల ముందు పొత్తులు
కమలానికి తొత్తులు
ఏవో నక్క జిత్తులు
పార్టీ లన్నీ అధికార ఉన్మత్త చిత్తులు!
ఇప్పుడు ఆంధ్ర
అభివృద్ది లేని పురాతన సౌధం
గమనమే గాని గమ్యం లేని కంటక పథం!
తిలా పాపం తలా పిడికెడు
ఇదేం ఖర్మ రా
ఒట్టి బుసల నాయుడు
అటు చూస్తే భజన సేన
ఆవేశాలకి నమూనా!
వెండితెర పులి వణికించదు!
జగన్నాటకానికి తెర లేచింది
లైట్స్, కెమెరా, ఫ్యాక్షన్
మూడు రాజధానుల ముచ్చటలో
సామాన్యుని ప్రస్థానమెక్కడ?
వీరేశ్వర రావు మూల – 08.01.2023
Also read: భ్రమరావతి
Also read: అవ “మానాలై”
Also read: ఆర్ ఆర్ ఆర్ : కొట్టొచ్చినట్టు కనిపించిన కథలేని లోటు