మనిషి మెదడు రెండు రకాలుగా ఆలోచించ గలదు. Inductive logic, Deductive logic. మన గురుకులాల్లో సూత్రం నేర్పించి అది మనం అన్నిటా వర్తింపజేసుకునే పద్దతి. ఇది Deductive logic. పశ్చిమ దేశాల్లో విద్య Inductive logic పై ఆధార పడింది. అంటే విషయాన్ని పదే పదే చూసి చివరకు సూత్రీకరీంచడం.
ఇంగ్లీషు వాళ్ళ ప్రభావంతో సరియైన, సులభమైన మన పధ్ధతి వదలి కష్టమైన, లోపభూయిష్టమైన వారి ఆలోచనా పధ్ధతి అవలంబించాం. ఉదాహరణకు చిన్న పిల్లవాడికి నీతి సూత్రం చెబితే అర్దం కాదు. కధ, ఆట, పాట రూపంలో చెప్పాలి. పెద్ద వాడికి, ఆలోచన చేయగలిగిన వాడికి సూత్రం చెప్పి వదిలేస్తే దాన్ని వివిధ విషయాలకు అన్వయించు కోగలడు. మన పొరపాటు ఏమిటంటే చిన్న పెద్ద అందరికీ ఒకటే పధ్ధతి, Inductive logic ఉపయోగించడం. ఈ కారణంగా ఆలోచించి సూత్రీకరించే పని చేయకుండా అంటే చదివిన పొయింట్లు గుర్తుంచుకోవడం తప్ప అవి ఎందుకు ఎలా ఉపయోగపడతాయో తెలియని స్థితిలో ఉండిపోతున్నాడు పెద్దవాడు. అందుకనే ఉద్యోగాలు కొల్లలు ఉన్నా నిరుద్యోగం తాండవిస్తుంది.
14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ఆ వయసు దాటిన వారికి ఒకే లాజిక్ పనికిరాదు.
Also read: “తెలుగు”
Also read: “మానవ జీవితంలో భగవద్గీత”
Also read: “జీవితం ఎందుకు?”
Also read: తెలుగును ఆంగ్లంతో కలుషితం చేస్తున్నామా?
Also read: “టీ టైంమ్ పొయెట్స్”