ఏ జైలు ఊచలు
వాళ్ళని ఆపలేవు
ఊచల్ని మించి ఎదిగిన వాళ్ళు
అవినీతి ఊడల్ని దింపిన వాళ్ళు
వాళ్ళు దేశాల ఎల్లల్ని చెరిపేస్తారు
మాల్యాలకు ఈ జాతి మూల్యం చెల్లిస్తుంది !
వాళ్ళ ని ప్రశ్నించడానికి ఖాకి లు
భయపడతారు !
ఈ ఖాకీ ల కు మరియమ్మ లే లోకువ
నేరం ఋజువు కాక ముందే శిక్షలు
అమలు చేస్తారు
లాకప్
డెత్ చిరునామా గా మారుతుంది !
ఖాకీచకులు చెలరేగి పోతారు
వాడి ఒంటి మీద డ్రస్
మానవత్వానికి అడ్రస్ లేకుండా చేస్తుంది !
గ్రామ దేవత కి కూడా
పులిని కోరుకోవడం భయం
మేక బలే నయం !
ఇదే
చర్విత చర్వణం
Also read: నాన్నకి తెలిసినది
Also read: ఇలా మిగిలాం !
Also read: అర్ధ రాత్రి స్వతంత్రం
Also read: నాణానికి మూడో వైపు
Also read: గీటురాయి