పుటక
శరీరం మనసు స్వచ్ఛంగా.
అమ్మ నేర్పుతుంది మాట
నాన్న నేర్పుతాడు నడత
ఉపాధ్యాయుడు వేస్తాడు బాట
పెద్దలు చెబుతారు నీతులు
స్నేహితులతో వస్తాయి అలవాట్లు
వృత్తి నేర్పుతుంది నైపుణ్యం
పెళ్ళాంతో వస్తుంది మోహం
పిల్లలతో తెలుస్తుంది పొదుపు
అలా తలా ఒక దెబ్బ వేస్తే
తయారవుతుంది
నీ వ్యక్తిత్వం
అదే సఘం చెక్కిన శిల్పం.
అది శిల్పమే
ఆత్మ లేని శిల
నీలో స్పందన లేకపోతే
నీ అంతరాల్లో ఆలోచన రేకెత్తకపోతే
నీకు నీ సంఘానికి అంతరం లేకపోతే
నువ్వు అందమైన శిలవే
నీ స్వంత ఆలోచన రగిలి
నీ సంఘం నీడ నీ నుండి తొలిగి
నువ్వు నువ్వుగా మిగిలితే
అదే నీ స్వఛ్ఛ జీవాత్మ
అదే నీ సుందర సజీవ శిల్పం.
Also read: సంస్కృతం
Also read: మరక మంచిదే
Also read: ఙాన జ్యోతి
Also read: ఆనంద మార్గం
Also read: నిందాకృష్ణ