టెన్నిస్ అంటే ఇష్టం,
జాన్ మెకంరో అంటే మరీ!
అతని రాకెట్ ఊపు కంటే నాలిక ఊపేది ఎక్కువ.
బాలు కొట్టే వేగం కన్నా
అతని బూతుల రాగం గొప్ప.
వాడి మాచి మిస్సయిందే లేదు!
రాజకీయలన్న నాకంతే!
నేనెవరికి ఓటేస్తే ఎం?
వాళ్లు ప్రజా ధనం ఎంత దోచేస్తే ఎమ్?
పాత బస్తీ లో ఎప్పుడో ఓసారి,
చట్ట సభలలో ఎప్పుడూ…
వాళ్లు కొట్టుకొంటుంటే బాగుంటుంది,
బండ బూతులు తిట్టుకొంటుంటే బాగుంటుంది!
అంతటితో నా కుతి తీరదు.
పొద్దున్నే సాక్షి, జ్యోతి, ఈనాడు వగైరా వగైరా,
రంజు గా ఆ కథలు చదువుతోంటే
ఆహా! రాజకీయం అంటే ఇదిగా!
ఎంత సందడి, ప్రజలకు ఎంత వినోదం!
నేను మళ్ళీ ఓటు వేస్తా, మళ్ళి మళ్లీ ఓటు వేస్తా,
ప్రతి ఎన్నికల పండుగకు
మైళ్ళు, మైళ్ళు నడచి పోయి మరీ ఓటు వేస్తా!
వాళ్ళకే వేస్త!
ఎంత వెధవలైతే అంత వినోదం
ఎంత దుర్మార్గులు అయితే అంత రసవత్తరం!
ఎంత వంచకులైతే అంత ఆసక్తికరం!
ఇంకేమి కావాలి సగటు ఓటరుకు!?
బాగా తెలిసి మోసపోవడంలో ఆ ఆనందమే వేరు!
అసలు మోసమనే మహా వృక్షానికి
రాజకీయమే తల్లివేరు!
Also read: ద్వంద్వాలు
Also read: కాలం
Also read: ఇజం
Also read: మరపు
Also read: ప్రకృతి
Voter atmanandam good