వోలెటి దివాకర్
రానున్న సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పొత్తుల అంశాన్ని తరువాత చూసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో తూర్పు గోదావరి జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్న నాయకులను కోఆర్డినేటర్ లుగా ప్రకటించారు. వీరిలో కొంత మంది గత ఎన్నికల్లో పోటీ చేసిన వారు కావడం గమనార్హం. జనసేన పార్టీతో పొత్తులు కుదిరితే రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం వంటి చోట్ల అభ్యర్థులను పోటీ నుంచి విరమించుకునే అవకాశాలు ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా లోని 7 అసెంబ్లీ లకు నూతన కో ఆర్డినేటర్ లను జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు ప్రకటించారు.. నూతన కో ఆర్డినేటర్ లు గా అసెంబ్లీ వారీగా .. యెనుముల రంగారావు (రంగబాబు ) – ( రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ ) ఆకుల శ్రీధర్ (రాజమండ్రి రూరల్ అసెంబ్లీ) ఏపీఆర్ చౌదరి ( రాజానగరం అసెంబ్లీ ) ఎమ్. శివారామ కృష్ణంరాజు ( అనపర్తి అసెంబ్లీ ) మాట్ల ఆంజనేయులు ( కొవ్వూరు అసెంబ్లీ ) బండి సత్యన్నారాయణ ( నిడదవోలు అసెంబ్లీ ) మైలు శ్రీనివాస్ ( గోపాలపురం అసెంబ్లీ ) లను నియమించారు..
ఈ సందర్భంగా నూతన అసెంబ్లీ కో ఆర్డినేటర్ లను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వేసి అసెంబ్లీ ని బలోపేతం చేస్తూ , అసెంబ్లీ స్థాయి లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని , అవసరమైతే ఉద్యమాలకు కూడా వెనుకంజ వేయకుండా పోరాడాలని పేర్కొంటూ రాబోయే 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రతి అసెంబ్లీ కో ఆర్డినేటర్ పనిచేయాలని పిలుపునిచ్చారు.