జీవితం ఓ ఆట చిన్నప్పుడు
కాస్త ఊహ తెలిసేప్పటికి
స్నేహమేరా జీవితం
యవ్వన ప్రాంగణంలో
గిర్రున తిరిగే రంగుల రాట్నం
కాస్త నిలదొక్కుకోగానే
సంపాదన పర్వం
పోటీ, ప్రావీణ్యం, పదవి
పక్కన ఓ తోడు జత కావడం
పిల్లలు, చదువులు, పెళ్లిళ్లు
బరువులు, బాధ్యతలు
నొప్పులు, రోగాలు, రొష్ఠులు
చివర అశుభం కార్డు.
మధ్యలో ఆశలు, ఆశయాలు
కలలు, కలతలు, కన్నీళ్ళు
డబ్బు, నగలు, మేడలు, గౌరవం,
‘జీవితమే సఫలము, రాగ సుధా భరితము‘
‘తెరెబినా జిందగీమె సికువాతో నహీ‘
‘నీవని నేనని తలచితిరా, నీవే నేనని తెలిసితిరా‘
ధ్యానం, యోగం, దండకం
ఏది జీవిత సాఫల్య పురస్కారం.
Also read: “పూజా ఫలం”
Also read: “సంక్రాంతి”
Also read: “రాజ్యాంగం”
Also read: “ఏది నిజం”
Also read: “దొంగ”