రాగద్వేషాల వెలుగు చీకట్లతో
పుట్టి పెరిగిన స్థితిగతులలో
జీతభత్యాలతో పిల్లా పాపలతో
నిత్య నైమిత్తిక జీవనం తృప్తికరం.
అంతర్లోకం ఎడతెగని అరుణ రాగం
యమ పాశాన్ని మీరిన బంధం
ప్రేమ శక్తిని చాటే పాంచజన్యం
దాచినా దాగని మనోరంజిత సౌరభం
జగం మిధ్య అన్నా అనుకున్నా
బ్రతకాల్సింది జనం మధ్యే
ఏదీ నీకు కావాలని అనిపించక పోయినా
జనం కోసమైనా బ్రతకాలి
అంతకంటే చేయాల్సింది
చెయ్యగలిగింది ఏముంది జీవితాన.