ఫొటో రైటప్: సర్వేపల్లి రాధాకృష్ణన్, గిడుగు రామ్మూర్తి పంతులు
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
ఉపాధ్యాయుడు
పిల్లలకు విద్య నేర్పిస్తాడు
మంచి చెడు చెబుతాడు
ఆట పాటలు నేర్పిస్తాడు
ఆరోగ్యకరమైన ఆలోచనలకు బాటలు వేస్తాడు
అజ్ఞాన చీకటి తొలగించి జ్ఞాన వెలుగు నింపుతాడు
ఒక మనిషిగా ఎదిగేందుకు సహాయ పడతాడు
వ్యక్తిత్వం ఏర్పడేందుకు మార్గదర్శనం చేస్తాడు.
మనిషికి తల లాగా
సమాజానికి తల ఉపాద్యాయుడు
ముందు చూపు కలవాడు
సాధ్యాసాధ్యాలు తెలియ చేస్తాడు
విద్యార్థులకు నిచ్చెనలా ఉపయోగ పడతాడు
తను వేరులా భూమిలో పాతుకు పోయినా
సమాజానికి జవజీవవాలిచ్చే వేరు ఇతడు
తగిన గౌరవం, ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు చేయగలడు
సూర్యలోకానికి లంఘించే వాళ్లను తయారు చేయగలడు.
ప్రగతికి మూలం విద్య
విద్యకు మూలం ఉపాధ్యాయుడు
ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఆద్యుడు
రేపటి సమాజం వైపు నడిపించగల దీర్ఘదర్శి
విద్యను రాజకీయంచేసి భ్రష్ఠు పట్టించకపోతే
మాసిబారిన వజ్రాలను గుర్తించి సానబట్టే కార్మికుడు
సమాజానికి అతను చేసే సేవను గుర్తించి అభినందిద్దాం
నమస్కారం తప్ప మరేదీ ఆశించని ఆ అల్ప సంతోషికి
మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం.
Also read: “గిడుగు రామ్మూర్తి పంతులు”
Also read: “అమ్మ మాట-బంగారు బాట”
Also read: “చందమామ”