ఋగ్వేదం కాలంలో ప్రకృతి దేవతలను కొలిచేవారు. ఈ ఎత్తైన కొండలు, ఎత్తైన చెట్లు..నిరంతరం వర్షం, పగలు ఎండ, రాత్రి వెన్నెల, చీకటి ఇవి ఎలావస్తున్నయో తెలియని రోజుల్లో ఆనాటి జనం వరుణ దేవున్ని, సోముడు, అగ్నిదేవుని, ఇంద్రుడిని, (దేవతలకు రాజు), వాయుదేవుని కొలిచేవారు.
Also read: బన్నీ ఉత్సవాలు ఆపుచేయాలి
ఆరోజుల్లో ఈనాటి దేవుళ్ళు లేరు. ఆదిమ మానవునికి బట్టలు లేవు. దిగంరంగా ఉండేవారు. అగ్ని తయారు చెయ్యని రోజుల్లో పచ్చి మాంసం తినేవారు. అగ్ని తయారుచేయటం నేర్చుకున్న తరువాత మాంసం కాల్చుకొని తినేవాడు. తరువాత తరువాత మొలకు ఆకులు, జంతు చర్మాలు చుట్టుకునేవాడు.
Also read: ఇదో వెర్రి ఆనందం
ఆలోచన పెరిగే కొద్ది ప్రకృతి దేవతలు, వీటికి దణ్ణం పెట్టుకుంటే ఏదో జరుగుద్ది అనుకొని, మనిషికి ఆకలి వెస్తే ఏదో తింటున్నట్లుగా, వీళ్ళు ఆరాధించే దేవతలకు బలులు ఇచ్చేవారు. ఆహారం తిన్నదేవతలు మనుషులకు కూడా అదేమాదిరి తినటానికి ఆహారం ఇస్తాడని నమ్మకము నుండి ఏర్పడింది బలులు ఇవ్వటం. ఋగ్వేదంలో అదేచెప్పబడింది.
దేవతలను సంతృప్తి పరిస్తే మనకు కావలసిన శక్తిని, ఆహారాన్ని, తాగటానికి సారాయిని పుష్కలంగా ఇవ్వమని ప్రార్థించే వారు.
Also read: మాయమవుతున్న లౌకికవాదం
ఇంద్రుడు సారాయి తాగటంలో బాగా పెరుమోశాడు. ఒకసారి ఒక వృతాసురుడు అనే రాక్షసుణ్ణి చంపటానికి మూడు చెరువుల ఇప్పసారాయి తాగాడని ఆర్షవిజ్ఞానంలో వ్రాసుకున్నారు.
సోమరసం తాగితే చాలా శక్తులు వస్తాయని అనుకునేవారు. మూగవారికి మాటలు, గుడ్డి వానికి చూపు , ఇలా ఇపుడు చర్చిలో ఎసుని కొలిస్తే వస్తాయని అనుకునే వారో, సొమరసం తాగితే అంత మహిమ ఉన్నదనుకునేవారు. ఇంద్రుడికి తాగితాగి వళ్లంతా పొడల రోగం వస్తే, దాన్ని పోగొట్టడానికి దేవతలు యాగం చేశారట. మనం గ్రహించ వలసింది ఆ రోజుల్లో ప్రజల ఆలోచనలు ఎలా వున్నాయో మాత్రమే చూడాలి.
మరి ఈరోజు వేల సంవత్సరాలు గడిచాయి. ఇతర గ్రహాల్లో కాపురం పెట్టబోతున్నారు. ఇంకా పాతకాలం ఆచారాలు కొనసాగిద్దాం అంటే మరలా వెనక్కు పోదామని కదా! పోయే వారికి అభ్యంతరం లేదు….పోతామంటే పోవచ్చు. పాతనీ పక్కకునెట్టి ముందుకు పోదాం అనేవారికి హేతువాద సంఘం ఆహ్వానం పలుకుతుంది.
Also read: మూఢనమ్మకాల నిర్ముాలనతోనే సమాజాభివృద్ధి
Narne Venkatasubbaiah