నీవెప్పుడు వస్తావోనని
నా తలపుల తలుపులు
ఎప్పుడూ తెరిచే ఉంచుతాను
నీ పాదల సడి
నీవు రాకమునుపే నా చెవిని చేరుతుంది
నీ పరిమళ భరిత శ్వాస
నన్ను మాధుర్య లోకాలలో ముంచేస్తుంది
నీ మహత్తర దివ్య రూపాన్ని
నా కళ్ళారా ఆస్వాదించనీ
రా. నాకు నీ సాన్నిహిత్యం ప్రసాదించు
నా జీవితాన్ని నీ పాదాల అర్పించనీ
Also read: దేవుడు
Also read: స్సందన
Also read: క్విట్ ఇండియా
Also read: ఇది వేద భూమి
Also read: ఫ్రపంచంఫ్రపంచం