- నెహ్రూను హామ్లెట్ తో పోల్చిన రాయ్
- అలహాబాద్ లో నెహ్రూ అతిథిగా రాయ్
- రాయ్ కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన లెనిన్
సోవియట్ విప్లవ విజేత లెనిన్ తో దీటుగా అగ్రస్థాయి సంఘంలో మాస్కోలో నిలచిన ఎం.ఎన్.రాయ్ ఆశ్చర్యకర పాత్ర వహించాడు. లెనిన్ కు మార్గాంతర సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, గుర్తింపు పొంది, సోవియట్ యూనియన్ లో గౌరవం చేకూర్చుకున్న ఎం.ఎన్.రాయ్ ఆసాధారణ పాత్ర నిర్వహించాడు. ఇదంతా ఆశ్చర్యకర పరిణామం అయినా ఆనాటి పరిస్థితుల వలన వెంటనే భారతదేశానికి తెలియలేదు. అయితే ఎం.ఎన్.రాయ్ పాత్ర గురించి తెలిసిన జవహర్ లాల్ నెహ్రూ ఆయన్ను కలుసుకోవాలనుకున్నాడు. 1927లో మాస్కో వెళ్ళినప్పుడు రాయ్ నెహ్రూలు కలిశారు.
ఇదంతా నాటి పరిస్థితుల వలన ప్రాధాన్యత పొందలేదు. మెక్సికోలో విప్లవ పాత్ర నిర్వహించిన రాయ్ ను లెనిన్ గుర్తించి, మాస్కో ఆహ్వానించి తనతో సమానంగా కమిటీలో స్థానం యిచ్చాడు. ఇండియాలో నాటి కమ్యూనిస్టులకు యిదంతా కంటకంగా వుంది.
అయితే రాయ్ ను కలుసుకోవాలనే కోరికను మాస్కో సందర్శనం ద్వారా నెహ్రూ తీర్చుకున్నాడు. ఆ తరువాత రాయ్ ఇండియా రావడం, జైలు శిక్ష అనుభవించి బయటకు రావడం చరిత్ర. అప్పుడు జవహర్ లాల్ ఫైజ్ పూర్ కాంగ్రెస్ లో రాయ్ ను కలసి, కొన్నాళ్ళు అలహాబాద్ లో తన అతిథిగా వుండమన్నాడు. అంగీకరించి, నెహ్రూతో గడపి, ఉత్తర ప్రదేశ్ లో పర్యటించిన రాయ్, కాంగ్రెస్ లో చేరాడు.
నెహ్రూ కాంగ్రెస్ లో కీలక నాయకుడుగా గాంధీకి వారసుడయ్యాడు. రాయ్ స్వతంత్రంగా మానవవాదాన్ని పెంపొందించాడు. నెహ్రూ పాత్రను నిశితంగా పరిశీలించిన రాయ్, కాంగ్రెస్ రాజకీయాలలో ఆయన పాత్రను గమనిస్తూ వచ్చాడు. నెహ్రూ తటపటాయింపు రాజకీయాలను వ్యాఖ్యానిస్తూ, హామ్లెట్ గా చిత్రించాడు. వుందామా వద్దా (టు బి ఆర్ నాట్ టు బి ఈజ్ ద క్వశ్చన్) అనే హామ్లెట్ తో నెహ్రూను పోల్చుతూ రాయ్ రాశాడు. వారిద్దరి సంబంధం మిత్రత్వంగానే సాగింది. ఎవరి రాజకీయాలు వారివి. చరిత్రలో యీ విషయాలు ఆసక్తికరమైనవి!
Thank you for the post on your blog. Do you provide an RSS feed?