- 7 మ్యాచ్ ల్లో యువీ 17 సిక్సర్లు
- వాడీవేడీ తగ్గని భారత దిగ్గజాలు
ఆరుదేశాల లెజెండ్స్ రోడ్ సేఫ్టీ టీ-20 క్రికెట్ టైటిల్ ను సచిన్ టెండుల్కర్ నాయకత్వంలోని భారత దిగ్గజజట్టు గెలుచుకొంది. రాయ్ పూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన టైటిల్ సమరంలో భారత్ 14 పరుగుల తేడాతో శ్రీలంకను అధిగమించింది. బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్న ఈ టోర్నీని తొలిసారిగా రాయ్ పూర్ వేదికగానే నిర్వహించారు.ఆరుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ గా జరిగిన ఈటోర్నీలో అత్యధిక విజయాలతో భారత్, శ్రీలంకజట్లు టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి.
యూవీ…జవాబ్ నహీ
దేశంలోని కోట్లాదిమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల స్కోరు నమోదు చేసింది.మిడిలార్డర్ ఆటగాడు, సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ 41 బాల్స్ లో 60 పరుగులు, ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ 36 బాల్స్ లో 5 సిక్సర్లు, 4 బౌండ్రీలతో 62 పరుగులు సాధించారు.
Also Read: ఆఖరాటలో రోహిత్, కొహ్లీ వీరవిహారం
శ్రీలంకకు పఠాన్ బ్రదర్స్ చెక్….
182 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్, యూసుఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ లీగ్ దశ నుంచి ఫైనల్స్ వరకూ ఆడిన మొత్తం 7 మ్యాచ్ ల్లో 17 సిక్సర్లు బాది తన పేరును సార్థకం చేసుకున్నాడు.
సచిన్,దిల్షాన్ టాప్…
శ్రీలంక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ మొత్తం 271 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. భారత్ తరపున కెప్టెన్ సచిన్ టెండుల్కర్ 233 పరుగులు నమోదు చేశాడు.బౌలర్లలో దిల్షాన్ 12 వికెట్లతో అగ్రస్థానంలో నిలువగా యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్ చెరో 9 వికెట్ల చొప్పున పడగొట్టి సంయుక్త ద్వితీయ స్థానంలో నిలిచారు. 271 పరుగులు, 12 వికెట్లు పడగొట్టిన శ్రీలంక ఆల్ రౌండర్ తిలకరత్నే దిల్షాన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.
Also Read: టీ-20ల్లో విరాట్ రికార్డుల పర్వం