వాసుదేవుడిగా ఆవిర్భవించి
యశోదామాత వాత్సల్యము గ్రోలి
గోవర్ధన గిరి చాటున గోపకులను కాచి
కాళీయ పడగపై తాండవమాడి
గోపికాజన మోహార్ద్రత హరించి
కంసాది రాక్షసుల వధించి
కుచేల మిత్రత్వం అనుభూతి చెంది
అష్టభార్యల ప్రేమ స్వరూపుడు
సకల జగన్నాధుడు
పార్థసారధియై
మహాభారత యుధ్ధాన
దుష్ట శిక్షణ ప్రేరేపిస్తూ
ఒకవంక సూత్రధారిగా
మరోవంక కర్మ ఫలం అంటూ
తాను నిమిత్త మాత్రుడననిపిస్తూ
జీవన గీతను బోధించిన
జగద్గురువుకు నమస్కారం
నిండు మనసుతో మనస్కారం
Also read: వందనం
Also read: సజీవ శిల్పం
Also read: సంస్కృతం
Also read: మరక మంచిదే
Also read: ఙాన జ్యోతి