———— ————
Hermit and the Beasts
————————————
(From ‘The Wanderer’ by KAHLIL GIBRAN)
అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
11.సంచారి తత్వాలు
————— ——————-
ఒకానొకప్పుడు పచ్చని కొండల మధ్య ఒక సన్యాసి నివాసం ఉండేవాడు. అతడు ఆత్మశుద్ధి మరియు స్వచ్ఛమైన మనసు కల వాడు. భూచరాలైన జంతువులు, ఆకాశ యానం చేసే గ్రద్ద, రాబందుల లాంటి పక్షులు జంటలుగా అతని వద్దకు వచ్చేవి. వాటితో ఆ సన్యాసి మాట్లాడేవాడు. అవి ఆయన చెప్పే మాటలు సంతోషంగా వినేవి. రాత్రి అయ్యే వరకు కదిలేవి కావు. అప్పుడాయన వాటిని ఆశీర్వదిస్తూ , వాటి నివాసాలకు సాగనంపేవాడు.
ఒక సాయంత్రం వేళ ఆ సన్యాసి వాటికి ‘ప్రేమ‘ గురించి చెప్పసాగాడు. ఇంతలో ఒక చిరుత పులి ఇలా అంది ” స్వామీ ! మీరు ప్రేమ గురించి చెబుతున్నారు. మరి మీ సహచరి ఎక్కడ?”
“నాకు సహచరి లేదు.” అని సన్యాసి జవాబిచ్చాడు.
జంతువులు, పక్షులు ఒక్కసారిగా ఆశ్చర్యంతో అరిచి వాటిలో అవి ఇలా అనుకోసాగాయి ! ” సహచరియే లేనప్పుడు ఈయన మనకు ప్రేమ, శృంగారం గురించి ఏమి తెలుసునని చెబుతాడు ?!’
అవి నెమ్మదిగా తృణీకార భావంతో అక్కడినుండి వెళ్లిపోయాయి.
ఆ రాత్రి సన్యాసి పడక మీద బోర్లా పడుకొని గుండెలవిసేలా దుఃఖించాడు.
Also read: సంచారి తత్త్వాలు
Also read: సంచారి తత్త్వాలు
Also read: హేతువు– తృష్ణ
Also read: సందేహం – సంకల్పం – సందేశం
Also read: ప్రేమా , అసహ్యమూ