————————–
( ‘LAWS AND LAW — GIVING ‘ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN )
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
20. సంచారి తత్త్వాలు
—————- ———– ——————
చాలా కాలం క్రితం ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు చాలా తెలివైన వాడు. ప్రజల కోసం అతడు చట్టాలు చేద్దామని కోరుకున్నాడు.
వేయి తెగల నుండి వెయ్యి మంది తెలివైన వారిని రాజధానికి పిలిపించి, చట్టాలు చేయమని పురమాయించాడు.
చట్టాలు చేయడానికి రంగం సిధ్ధమైంది.
వేయి చట్టాలు తయారు చేయబడ్డాయి. అవి రాజుకి అందజేశారు. రాజు వాటిని చదివాడు. తన రాజ్యంలో వేయి రకాల నేరాలు ఉన్నాయని అప్పటిదాకా తనకు తెలియనందుకు రాజు మనసులో చాలా దుఃఖించాడు.
తరువాత రాజు తన లేఖరిని పిలిచి, నవ్వు ముఖంతో చట్టాలు తానే నిర్దేశించాడు. కాని , ఆయన నిర్దేశించిన చట్టాలు ఏడు మాత్రమే !
వేయి మంది తెలివైన వారు రాజుపై కోపంతో వేయి చట్టాలు పట్టుకుని వారి వారి తెగలకు వెళ్లిపోయారు. ప్రతీ తెగా వారి వారి జ్ఞానుల చట్టాలను అనుసరించసాగాయి.
అందుచేత, ఇప్పటివరకు కూడా ఆ వేయి చట్టాలు అమలులో ఉంటూ ఉన్నాయి !
అది ఒక గొప్ప సామ్రాజ్యం. ఆ రాజ్యంలో వేయి జైళ్లున్నాయి. ఆ జైళ్లు వేయి చట్టాలకు విరుధ్ధమైన పనులు చేసిన మనుషులతో (ఆడా, మగా) నిండి పోయాయి.
అది నిజంగా గొప్ప రాజ్యము. కాని, దానిలో నివసించే ప్రజలు — వేయి చట్టాలు చేసినవారి మరియు ఒకే ఒక్క రాజు గారి — వారసులు.
Also read: మతి లేని మనిషి
Also read: చట్టాలు
Also read: సప్తతి పూర్వార్ధం……లో
Also read: విగ్రహం
Also read: ఇద్దరు సంరక్షక దేవ దూతలు