- లాలూ, రాబ్డీ దేవి, పరిమిత అతిథుల సమక్షంలో
- అతిథులలో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్
- తొమ్మిదిమంది లాలూ సంతానంలో చివరివాడు తేజశ్వి
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ద్వితీయ కుమారుడు, రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనాయకుడు తేజశ్వి యాదవ్ వివాహం గురువారంనాడు జరిగింది. దీంతో లాలూ ప్రసాద్ సంతానం అందరికీ పెళ్ళిళ్ళు అయినట్టు అయింది. లాలూ ప్రసాద్, బాబ్డీ దేవికి తొమ్మిదిమంది సంతానం. వారిలో అందరికంటే చిన్నవాడు తేజశ్వి. తేజ్ ప్రతాప్ తేజశ్వి అన్న. తక్కిన ఏడుగురూ తేజశ్వి అక్కలే. తేజశ్వి సోదరి రోహిణీ ఆచార్య పెళ్ళి ఫోటోలకే ట్వీట్ చేశారు. రేచల్ గోడిన్హో అనే అమ్మాయిని తేజశ్వి పెళ్ళి చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్, బాబ్డీదేవి సమక్షంలో ఈ వివాహం జరిగినట్టు విజువల్స్ సూచిస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ వివాహానికి హాజరైన అతిథులలో ఒకరు. సుమారు 50 మంది సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులు వివాహానికి హాజరైనారు.
32 సంవత్సరాల తేజశ్వి బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. గత ఎన్నికలలో తండ్రి జైలులో ఉన్నసమయంలో ప్రతిపక్ష కూటమికి తేజశ్వి నాయకత్వం వహించారు. కానీ నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ-బీజేపీ కూటమిని విజయం వరించింది. ఒమిక్రాన్ ఉధృతి పెంచుతున్న నేపథ్యంలో ఎక్కువ మందిని పలిచి రాద్ధాంతం చేయడం తేజశ్వికి ఇష్టం లేకపోయింది. అందుకే అతిథుల జాబితాను బాగా కుదించారు.