భారత దేశానికి నెహ్రూ తరువాతి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి.
పేద కుటుంబంలో పుట్టాడు. గంగానది అవతలి ఒడ్డున ఉన్న బడికి నావలో వెళ్లడానికి డబ్బు లేక రోజూ నదిని ఈదుకుని బడికి వెళ్ళి వచ్చేవాడు. నెహ్రూ హయాంలో రైల్వే మంత్రిగా ఉండి ఒక రైలు ప్రమాదానికి గురైనపుడు రాజీనామా చేశాడు. ప్రధాన మంత్రిగా ఉన్నపుడు సొంత కారు లేదని అందరూ మాట్లాడితే అప్పుచేసి కారు కొన్నాడు.
పాకిస్తాన్ తో యుద్ధం వస్తే దీటుగా ఎదుర్కొన్న ఐదడుగుల వీరుడు. నిధులు లేక ప్రజల నడిగితే ప్రజలు డబ్బు నగలు ఉదారంగా ఇచ్చారు. శతృవుకు అగ్రరాజ్యం అమెరికా వత్తాసు పలికితే వేలు చూపించి తప్పు చేస్తున్నావని నిలదీసిన ధీరుడు.
ఆ నాడు ప్రతి ఏడు
PL480 అనే స్కీం తో
అమెరికా స్టీమర్ల నిండా గోధుమలు తెచ్చి మనకు దానమిస్తేనే మన ఉత్తర భారతానికి భోజనం. ఆ స్థితి నుండి బయట పడడానికి వ్యవసాయ అభివృద్దికి కృషి చేశాడు. స్వామినాధన్ అనే వ్యవసాయ పరిశోధకుడితో సంకర గోధుమ మొక్కలు తయారు చేయించి అధిక దిగుబడి సాధించాడు. అంతవరకు భారతీయులందరినీ వారానికి ఒక పూట భోజనం మాన మన్నాడు. అందరూ దాన్ని పాటించారు.
జై జవాన్, జై కిసాన్ నినాదంతో భారత రక్షణ, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కారకుడు.
పాకిస్తాన్ తో యుద్ధం తరువాత రష్యా ఇద్దరికీ సంధి కుదురుస్తానంటే తాష్కెంట్ నగరం వెళ్లి ఆక్కడే చనిపోయాడు. అతని చావు గురించి అనుమానాలున్నా అతని తరువాత ప్రధాన మంత్రి అయిన ఇందిరా గాంధి ఆయన చావు గురించి విచారణ జరిపించ లేదు.
కష్ట కాలంలో దేశాన్ని సరైన దిశలో నడిపించిన నిస్వార్థ త్యాగ జీవి లాల్ బహదూర్ శాస్త్రి.
Also read: “విద్యార్ధి”
Also read: “వృద్ధాప్యం”
Also read: “అక్షర ధాం, ఢిల్లీ – అపరూప కళా ఖండం”
Also read: “కాశ్మీర్”
Also read: “మహాభారతంలో శకుని”