————————-
(‘ LADY RUTH’ FROM ‘ THE WANDERER’ BY KAHLIL GIBRAN)
తెలుగు సేత:డా. సి. బి. చంద్ర మోహన్
31. సంచారి తత్త్వాలు
————————-
ముగ్గురు వ్యక్తులు ఓ పచ్చని కొండ మీద ఉన్న ఒక తెల్లటి గృహాన్ని దూరం నుండి చూసారు. వారిలో ఒకరు ” అది రూత్ దొరసాని ఇల్లు. ఆవిడ ఒక ముసలి మంత్రగత్తె. ” అన్నాడు.
రెండో వ్యక్తి ” నువ్వు చెప్పేది తప్పు. రూత్ దొరసాని చాలా అందగత్తె. ఆమె అక్కడ కలల్లో కూడా పవిత్రంగా బతుకుతుంది.” అన్నాడు.
మూడో వ్యక్తి ” మీరిద్దరూ తప్పే! రూత్ దొరసాని ఈ విశాలమైన భూములన్నిటికి స్వంతదారు. ఆమె సేవకుల రక్తాన్ని పీలుస్తుంది.” అన్నాడు.
వారు అలా రూత్ దొరసాని గురించి మాట్లాడుకుంటూ నడవసాగారు.
వారు ఒక కూడలి చేరి, అక్కడ ఒక ముసలి మనిషిని కలిసారు. వారిలో ఒకరు ఆయనతో ఇలా అన్నారు. ” ఆ కొండ మీద ఇంట్లో నివసించే రూత్ దొరసాని గురించి దయచేసి మాకు చెప్పగలరా?”
ఆ ముసలాయన తలెత్తి , వారిని చూసి నవ్వుతూ ఇలా చెప్పాడు. ” నాకిప్పుడు తొంభై ఏళ్ళు. నేను చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు రూత్ దొరసాని ఉండేదని జ్ఞాపకం. కాని ఎనిమిదేళ్ల క్రితం ఆమె చనిపోయింది. అది ఇప్పుడు ఖాళీ ఇల్లు. ఆ ఇంట్లో గుడ్లగూబలు చేరి అరుస్తూ ఉంటాయి. జనాలు అది దెయ్యాలు తిరిగే చోటు అనుకుంటారు.”
————————-
Also read: రెండు కవితలు
Also read: పాత ద్రాక్ష సారా
Also read: ‘మరణానంతర జీవితం’ నవల – ఒక పరిశీలన
Also read: భోజనం, పానీయం