మంచిర్యాల: పెద్దపల్లి జిల్లా కల్వచర్ల గ్రామ శివారులో 17 ఫిబ్రవరి 2021న హతులైన న్యాయవాదులు గట్టు వామన రావు, పివి నాగమణి హైదరాబాదు నుంచి మంథనికి వచ్చి మంథని కోర్ట్ లో ఉన్నట్టు సమాచారాన్ని కుంట శ్రీనుకు అందించి, వారి హత్య పథకంలో సహకరించిన ఊదరి లచ్చయ్య ను గురువారంనాడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు.
ఊదరి లక్ష్మణ్ అలియాస్ లచ్చయ్య గత 20 సంవత్సరాల నుంచి పెద్దమనిషిగా గుంజపడుగు గ్రామంలో మంచిచెడులు చూసుకుంటూ ఉండేవాడు. ‘‘గుంజపడుగులో చేసే ప్రతి కార్యక్రమంలో గుంజపడుగు గ్రామ అయ్యవారు అయిన గట్టు కిషన్ రావు కొడుకు గట్టు వామన రావు, అతని భార్య పివి నాగమణి హైకోర్టు న్యాయవాదులమని చెబుతూ అడ్డు తగిలేవారు. గుంజపడుగు సర్పంచ్ కుంట రాజును తమ గుప్పిట్లో పెట్టుకొని మా అందరి పై ఏదోవిధంగా కోర్టులలో దావాలు వేస్తూ ప్రభుత్వ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ మా పనులను అడ్డుకునేవారు. లచ్చయ్య చెప్పిన సమాచారం ప్రకారం హత్య రోజున ఘటనలు కింది విధంగా జరిగాయి.
‘‘అందులో భాగంగా 2013 సం. నుండి మా కుల దేవత అయిన పెద్దమ్మ గుడి ని కుంట శ్రీను నాయకత్వంలో మా కులం వాళ్ళు అందరు కలిసి చందాలు వేసుకొని గుంజపడుగు గ్రామం చెరువు ప్రక్కన కట్టుకునే క్రమంలో గట్టు వామనరావు, పివి నాగమణి లు ఎలాగైనా ఆ గుడి కట్టడం ఆపివేయాలని గ్రామపంచాయతీ ద్వారా అక్రమ కట్టడం అని చెప్పి నోటీసు లను ఇప్పించారు,’’ అని లచ్చయ్య చెప్పాడు.
Also Read: లాయర్ దంపతుల హత్యను సీరియస్ గా తీసుకొన్న పోలీసులు
అదే విధంగా కుంట శ్రీను ఇల్లు నిర్మాణం చేస్తున్న క్రమంలో గ్రామ పంచాయతీ అనుమతి లేదని అక్రమ కట్టడం అని నోటీసు ఇవ్వడం జరిగింది. ఇలా నోటీస్ పంపిన తర్వాత ఊదరి లచ్చయ్య, కుంట శ్రీను, అక్కపాక కుమార్ లు ముగ్గురు గుంజపడుగు ఊరి చెరువు పక్కన చెట్ల పొదలలో మద్యం తాగుతూ వామన రావు ని ఏదైనా చేయాలని అనుకొన్నారు.
అప్పుడు కుంట శ్రీను మిగతా ఇద్దరి తో వామన రావు ని ఎక్కడ దొరికినా చంపేస్తా, నా ఒక్కడితో వామన రావుని చంపడం వీలు కాదు ఒక పథకం ప్రకారం చంపుతా దానికి మీరిద్దరూ నాకు అవసరం వచ్చినప్పుడు సహకరించాలని చెప్పగా ఊదరి లచ్చయ్య వారి కులంవాళ్ళు గుడి నిర్మాణం కాకుండా ఆపించిన గట్టు వామన రావు మీద కోపంతో సరే చేస్తా అని చెప్పడం జరిగింది. అక్కపాక కుమార్ కుడా వామన రావు మన ఊరిలో ప్రతి పనికీ అడ్డు పడుతున్నాడని అతని చంపడంలో నీకు సహకరిస్తానని కుంట శ్రీను కి చెప్పడం జరిగింది.
17 ఫిబ్రవరి 2021 రోజున మంథని కి కుంట శ్రీను తన కారు లో అక్కపాక కుమార్, ఊదరి లచ్చయ్య తో కలిసి వెళ్లాడు. వారితో పాటు కార్యక్రమాలలో పాల్గొని మంథని అంబేద్కర్ చౌరస్తాకి రాగా కుంట శ్రీను కారుకుకి ఎదురుగా కోర్టు వైపు వెళ్తున్న కారును చూసి ఆ కార్ గట్టు వామనరావు దా కాదా అని ఆ కారు వెనకాల కోర్టు కి వెళ్లడం జరిగింది. కుంట శీను కారుని కోర్టు దగ్గర లోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆపి కుంట శ్రీను ఊదరి లచ్చయ్యను కోర్టు లోకి వెళ్లి వామనరావు అక్కడ ఉన్నాడో లేదో చూసి చెప్పు అని, ఒక వేళ అతను ఉన్నట్లయితే ఈ రోజు అతని చంపండమే అని చెప్పడం జరిగింది. ఊదరి లచ్చయ్య కోర్టు పరిసరాలకు వెళ్లి చూసి గట్టు వామన రావు కోర్టు పరిసరాలలో ఉన్నాడని కుంట శ్రీను కు చెప్పడం జరిగింది. కొంత సమయం తర్వాత గట్టు వామన్ రావు, అతని భార్య నాగమణి నలుపు రంగు కారులో డ్రైవర్ తో కలిసి కోర్ట్ నుండి బయలుదేరారు అని ఊదరి లచ్చయ్య కుంట శ్రీను కు ఫోన్ ద్వారా తెలపడం జరిగింది.
Also Read: న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురు అరెస్ట్
కుంట శ్రీను ఊదరి లచ్చయ్య తో నేను చిరంజీవి వేరే కార్లో ముందు వెళ్తాము. నీవు, అక్కపాక కుమారులు తన కారులో వామన రావు కార్ వెనకాల రండి అని చెప్పడం జరిగింది.ఒకవేళ వామన రావు గారు వేరే వైపు వెళ్ళినట్లయితే వెంబడించి వెంటనే నాకు సమాచారం ఇవ్వండి. లేదా ఒకవేళ మమ్మల్ని చూసి అనుమాన పడి తన కారుని వెనుకకి తిప్పుకొని మీ వైపు వస్తే మీరు వెంటనే కారుని అడ్డుకొని ఆపి మాకు చెప్తే వెనక నుండి వచ్చి చంపేస్తాం అని కుంట శ్రీను ఊదరి లచ్చయ్య కి చెప్పడం జరిగింది.
కుంట శ్రీను చెప్పిన పథకం ప్రకారం అక్కపాక కుమార్, ఊదరి లచ్చయ్య కుంట శ్రీను కారు లో వామనరావు కారుని వెనకాల వెంబడిస్తూ వెళ్లారు. ఊదరి లచ్చయ్య, అక్కపాక కుమార్ లు సెంటినరీ కాలనీ చేరుకునేసరికి కుంట శ్రీను అక్కపాక కుమార్ కి ఫోన్ చేసి గట్టు వామనరావు, అతని భార్య ను చంపినాము మీరు తిరిగి ఇంటికి వెళ్లిపోండి అని చెప్పడం జరిగింది.
వెంటనే ఊదరి లచ్చయ్య, అక్క పాక కుమార్ లు సెంటినరీ కాలనీ నుండి RG -3 జిఎం ఆఫీస్,అడ్రియల, రచ్చపల్లి, కన్నాల,నాగారం ల మీదుగా గుంజపడుగు వెళ్లిపోయారు.
Also Read: బంగారం కేసును చేధించిన రామగుండం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు..