Thursday, November 21, 2024

సాకర్ స్టార్ మెస్సీకి కుబేర కాంట్రాక్ట్

  • బార్సిలోనా క్లబ్ తో 4వేల 920కోట్ల ఒప్పందం
  • క్రీడాచరిత్రలోనే కళ్లు చెదిరే కాంట్రాక్టు

అర్జెంటీనా సాకర్ కెప్టెన్, బార్సిలోనా క్లబ్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మైదానంలోనే కాకుండా మైదానం వెలుపలా తనదైన శైలిలో ప్రపంచ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రొఫెషనల్ క్రీడాచరిత్రలోనే అత్యంత భారీ కాంట్రాక్టు అందుకొన్నఆటగాడిగా రికార్డులకెక్కాడు. వందాకోట్లు, రెండు వందల కోట్లు కాదు ఏకంగా 4వేల 920 కోట్ల రూపాయల కాంట్రాక్టు దక్కించుకుని తనకుతానే సాటిగా నిలిచాడు. మెస్సీ నాలుగేళ్ల తాజా కాంట్రాక్టు వివరాలను స్పానిష్ పత్రిక ఎల్‌ ముండో పతాకశీర్షికన ప్రచురించింది. మొత్తం నాలుగు సీజ‌న్లకు క‌లిపి మెస్సీకి బార్సిలోనా క్ల‌బ్ 55,52,37,619 యూరోలు ఇవ్వ‌నున్న‌ట్లు ఆ ప‌త్రిక వెల్ల‌డించింది. ఈ కాంట్రాక్టు ఇండియన్ కరెన్సీలో 4920 కోట్లకు సమానం. కాంట్రాక్ట్‌ లోని నియ‌మ నిబంధ‌న‌ల‌కు మెస్సీ క‌ట్టుబ‌డి ఉంటేనే ఈ మొత్తం అత‌నికి చెల్లిస్తామని క్లబ్ స్పష్టం చేసింది.

5 నెలల్లో ముగియనున్న కాంట్రాక్టు:

ఇది చదవండి: సునీల్ గవాస్కర్ కు అరుదైన కానుక

బార్సిలోనా క్లబ్ తో మెస్సీ కాంట్రాక్ట్ మ‌రో ఐదు నెల‌లు మాత్రమే ఉంది. అయితే ఇప్ప‌టికే మెస్సీ  51,15,40,545 యూరోలు ఆర్జించిన‌ట్లు ఎల్ ముండో ప‌త్రిక వివరించింది. ఈ ఒప్పందంలోని ఏ- కేట‌గిరీ కింద మెస్సీ ఎంత అందుకోబోతున్నాడో కూడా ఆ ప‌త్రిక బయటపెట్టింది. మెస్సీకి ప్ర‌తి సీజ‌న్‌కూ బార్సిలోనా 13,80,00,000 యూరోలు    (673 మిలియన్ డాలర్లు) చెల్లించడానికి సమ్మతించిటన్లు తెలిపింది. కాంట్రాక్ట్ కొనసాగించడానికి మెస్సీ ఆమోదం తెలిపిన కారణంగానే  11,52,25,000 యూరోల సైనింగ్‌-ఆన్ బోన‌స్ ఇవ్వ‌ాలని నిర్ణయించింది. ఇక లాయ‌ల్టీ బోన‌స్ కింద మ‌రో 7,79,29,955 యూరోల బోన‌స్ సైతం మెస్సీకి ద‌క్క‌నుంది. బార్సిలోనాను మెస్సీ వీడుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల నేప‌థ్యంలో ఈ బోన‌స్‌లు ప్ర‌క‌టించడం విశేషం. 2020 న‌వంబ‌ర్ 17న మెస్సీ, బార్సిలోనా మ‌ధ్య నాలుగేళ్ల కాంట్రాక్ట్ కుదిరింది.

మెస్సీకి చేరేది సగం మొత్తమే:

మెస్సీకి నాలుగేళ్ల కాలానికి బార్సిలోనా క్లబ్ చెల్లించనున్న 55,52,37,619 యూరోలలో సగం మొత్తం పన్నుల రూపంలో స్పెయిన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అంటే చివరకు మెస్సీకి చేరేది ఈ మొత్తంలో సగం మాత్రమే. ఇప్పటికే మెస్సీకి బార్సిలోనా 510 మిలియన్‌ యూరోలు చెల్లించిందని కూడా ఆ పత్రిక వివరించింది. గత 20 సంవత్సరాలుగా బార్సిలోనాలోనే ఉంటున్న మెస్సీకి గత ఏడాదే ఆ క్లబ్‌తో తీవ్ర విభేదాలు తలెత్తాయి. మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తి వల్ల అప్పుడే బయటకు వెళ్లాలనుకున్నా భారీ మొత్తంలో కాంట్రాక్టు ఉండడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని మెస్సీ మనసు మార్చుకొన్నాడు.

ఇది చదవండి: పీలేను మించిపోయిన క్రిస్టియానో రొనాల్డో

కాంట్రాక్టు వెల్లడి పై న్యాయపోరాటం:

తనకు బార్సిలోనా క్లబ్ కు మధ్య జరిగిన ఒప్పందం వివరాలను లీక్‌ చేసిన ఎల్‌ ముండో పత్రికపై మెస్సీ మండిపడుతున్నాడు. న్యాయపరమైన చర్యలకు మెస్సీతో పాటు బార్సిలోనా సైతం సిద్ధమైంది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్రతులు మెస్సీ, బార్సిలోనా, లాలీ గా, క్యూవాట్రెకాసస్‌ (అర్జెంటీనా న్యాయ సంస్థ) దగ్గర మాత్రమే ఉన్నాయి. అయితే బార్సిలోనా క్లబ్ కు చెందినవారే ఎవరో కాంట్రాక్టు సమాచారాన్ని బయటపెట్టారని మెస్సీ అనుమానిస్తున్నాడు. దీన్ని ఖండించిన ఆ క్లబ్‌ తాము కూడా ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని స్పష్టం చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles