- ఖమ్మం పార్టీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ హెచ్చరిక
- పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని సూచన
విభేదాలు వీడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన అన్నారు. పద్దతి మార్చుకుని పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కేటీఆర్ హచ్చరించారు.ఖమ్మం కార్పొరేషన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతిభవన్ లో కేటీఆర్ భేటీ అయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్, పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సమావేశానికి హాజరయ్యారు.
ఇది చదవండి: స్వామి భక్తిలో తరిస్తున్న టీఆర్ఎస్ నేతలు
జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండండి:
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించాలని అందుకోసం నేతలంతా ఐకమత్యంగా పనిచేయాలని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాదాపు అన్ని ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తున్నప్పటికీ ఖమ్మంలో మాత్రం ఫలితాలు ఆశాజనకంగా లేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జిల్లాలోని అన్ని స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించేదిశగా పనిచేయాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. దీనికోసం ఇప్పటినుంచే సమాయత్తం కావాలని అన్నారు.
ఇది చదవండి: ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మంగా మారిన సాగర్ ఉపఎన్నిక