Thursday, November 21, 2024

రేవంత్ రెడ్డి లాంటి నీచమైన నాయకుల నైజాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది- కేటీఆర్

రేవంత్ రెడ్డి లాంటి నీచమైన నాయకుల నైజాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది- కేటీఆర్ ట్వీట్

  • శశిథరూర్ ఒక గాడిద అంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యల ఆడియోని ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్
  • ఒక థర్డ్ రేటెడ్ క్రిమినల్ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలానే ఉంటుంది-  కేటీఆర్
  • ఫోరెన్సిక్ పరీక్షకు పంపితే ఓటుకు నోటు కేసులో దొరికిన ఆడియోతో ఇది సరిపోతుందన్న కేటీఆర్
  • శశిధరూర్ గాడిద అన్న రేవంత్ మాటల పైన సర్వత్రా వ్యక్తమవుతున్న విమర్శలు
  • సొంత పార్టీ జాతీయ సీనియర్ నేతల నుంచి విమర్శలు
  • వ్యాఖ్యలను ఉపసంహరించుకోవల్లన్న మనీష్ తివారి
  • రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొనే గాడిద అనే మాట మాట్లాడారేమో అన్న శశిధరూర్

తెలంగాణలో పర్యటించి తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానాలను అధ్యయనం చేసిన తర్వాత ప్రశంసించిన ఐటి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపి,మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ పై నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా సెగ తాకింది.

‘‘రేవంత్ రెడ్డి లాంటి థర్డ్ రేటెడ్ క్రిమినల్ ఒక పార్టీకి నాయకత్వం వహిస్తే ఇలాగే ఉంటుంది’’ అంటూ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ట్విట్టర్లో స్పందించారు. రేవంత్ రెడ్డిలాంటి  నీచమైన వ్యక్తులు స్పందించరేమో కానీ, రాజకీయాల్లో ఉన్న చెత్తను అందరి ముందు ఉంచాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి శశిథరూర్ పైన చేసిన ఆడియోను ట్వీట్ చేశారు. ఈ ఆడియో తనకు ఒక మీడియా మిత్రుడు పంపించారన్న కేటీఆర్, ఈ ఆడియోను ఫోరెన్సిక్ కి పంపిస్తే  ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి వాయిస్ తో కచ్చితంగా మ్యాచ్ అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన రాహుల్ గాంధీ ఏమైనా స్పందిస్తారా అని ప్రశ్నించారు….

రేవంత్ రెడ్డి సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత పైన నోరు పారేసుకోవడం పై అటు రాష్ట్రంలోని పలువురితో పాటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ సీనియర్ నేతలు చురకలు అంటిస్తూన్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేత, అధిష్టానానికి అత్యంత దగ్గరైన మనీష్ తివారి రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. శశిధరూర్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడని, ఆయన నీకు నాకు అలాగే అందరికీ అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.

మరోవైపు శశిధరూర్ సైతం తనదైన శైలిలో స్పందించారు. బహుశా రేవంత్ రెడ్డి ఆయన మూలాలను గుర్తుంచుకొని గాడిద ఆనే మాట అన్నారేమో అని స్పందించారు. తాము ప్రచురించిన వార్తాకథనం లో ఏ మాత్రం ఆవాస్తవం లేదని తమ వద్ద ఖచ్చితమైన ఆధారం ఉందని, తమ వార్తాకథనాన్ని కి కట్టుబడి ఉన్నామని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక తెలిపింది.

సాదిక్
సాదిక్
సాదిక్ పన్నెండేళ్ళకు పైగా ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో ఉన్నారు. కమ్యూనికేషన్స్, జర్నలిజంలలోో ఎంఏ, ఎల్ఎల్ బీ చదివిన విద్యాధికుడు. హెచ్ఎంటీవీలో సీనియర్ కరెస్పాండెంట్ గా పని చేశారు. విశ్వసనీయత, కచ్చితత్వం, సామాజిక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వృత్తి విలువలకు నిబద్ధుడై పని చేసే నిష్ఠ కలిగిన జర్నలిస్టు. Phone: 8179221604

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles