* 26 బాల్స్ లోనే సుడిగాలి హాఫ్ సెంచరీ
* భావోద్వేగానికి గురైన కృణాల్
భారత స్పిన్ ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా అరంగేట్రం వన్డేలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలివన్డే ద్వారా అరంగేట్రం చేసిన కృణాల్ మెరుపు హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు. భారత్ 300కు పైగా స్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.
కర్ణాటక యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణతో కలసి వన్డే క్యాప్ అందుకొన్న కృణాల్ తన తొలిఇన్నింగ్స్ లోనే బ్యాట్ పవరేంటో చూపాడు.
Also Read : అయ్యర్ కు విదేశీ లీగ్ చాన్స్
భారత్ క్లిష్ట సమయంలో ఉన్న తరుణంలో ఆట 40.3 ఓవర్లో క్రీజ్‌లోకి వచ్చిన కృణాల్ చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 112 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఇప్పటి వరకూ న్యూజిలాండ్ ఆటగాడు జాన్ మోరిసన్ పేరుతో ఉన్న 35 బాల్స్ హాఫ్ సెంచరీ ప్రపంచ రికార్డును కృణాల్ కేవలం 26 బాల్స్ లోనే అధిగమించాడు. 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు.
తమ్ముడి చేతుల మీదుగా వన్డే క్యాప్
అరంగేట్రం వన్డే మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ నమోదు చేసిన 15వ భారత క్రికెటర్ గా కృణాల్ నిలిచాడు. అంతేకాదు… 7వ డౌన్ లో బ్యాటింగ్‌కు దిగి అర్థశతకం బాదిన మూడో భారత ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.
అంతకుముందు… ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కృణాల్ పాండ్యాకు తన తమ్ముడు హార్థిక్ పాండ్యా వన్డే క్యాప్ ను అందచేయటం విశేషం.
Also Read : మరాఠాగడ్డపై వన్డే సమరం
తమ్ముడు హార్దిక్ నుంచి వన్డే క్యాప్ అందుకున్న కృనాల్.. తన తండ్రిని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. కొద్దిమాసాల క్రితమే పాండ్యా సోదరులు తమ తండ్రిని కోల్పోయారు. ఆ విషాదాన్ని గుర్తు చేసుకొని కృణాల్ భావోద్వేగానికి గురికాగా..తమ్ముడు హార్థిక్ అక్కున చేర్చుకొని ఓదార్చాడు.
2009లో శ్రీలంక ప్రత్యర్థిగా అరంగేట్రం వన్డేలోనే రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ సాధించగా.. ఆ తర్వాత కృణాల్ అదే ఘనతను సొంతం చేసుకోడం విశేషం.
Also Read : లెజెండ్స్ టీ-20 విజేత భారత్