Thursday, November 7, 2024

విజయమో వీరస్వర్గమో తేల్చుకో!

ఫొటో రైటప్: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్

భగవద్గీత 75

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్‌ ప్రధాని విన్స్టన్‌ చర్చిల్ ఒక యూనివర్సిటీ విద్యార్ధులకు ఇచ్చిన ఉపన్యాసం. Shortest speech in world history అని ఎక్కడో చదివినట్లు గురుతు. ఆ స్పీచ్‌ ఒకటే ఒక వాక్యం.

‘’NEVER GIVE UP’’ వదలిపెట్టవద్దు. ఏది వదిలిపెట్టవద్దు. నీ ప్రయత్నాన్ని వదిలిపెట్టవద్దు. See the logical end of it!

అయితే ప్రయత్నమారంభించి మధ్యలో వదిలివేసే వారి గురించి భర్తృహరి ఒక చక్కటి శ్లోకం చెప్పారు. దానికి ఏనుగులక్ష్మణకవి అద్భుతమైన తెలుగుసేత మీముందుంచుతాను.

Also read: నీ మనసే నీ మిత్రుడు

ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్‌

ధీరుల్‌ విఘ్న నిహన్య మానులగుచున్‌ ధ్రుత్యున్నతోత్సాహులై

ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్‌ గావునన్‌

నీచమానవుడు అసలు మొదలు పెట్టడు. మొదలుపెట్టి మధ్యలో వదిలేవాడు మధ్యముడట. ఎన్ని విఘ్నాలెదురైనా వాటన్నింటినీ అధిగమించి ఉత్సాహంగా తాను మొదలుపెట్టిన పనిని పూర్తిచేసేవాడు ధీరుడు.

గీతలో పరమాత్మ ఇదేకదా చెప్పినది!

బావా గాండీవం జారుతున్నది. వణుకు పుడుతున్నది అని చెమటలు కారుతూ ముక్కంటిని ఎదిరించి నిలిచి పాశుపతం సంపాదించిన పార్ధుడంతటివాడు బేజారైతే!

Also read: సంకల్పాలు త్యజించినవాడే యోగి!

నాయనా పేడివి కాబోకురా. లే… మొదలుపెట్టిన పనిని పూర్తిచేయ్‌. అంతిమ సత్యం చావేరానాయనా. Get up అని ఉత్సాహపరచి లేపిన శ్లోకం ఇది…

హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం

తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః

చనిపోయావా స్వర్గం చేరుకుంటావు. గెలిచావా రాజ్యభోగాలనుభవిస్తావు. కాబట్టి లే, లేచి యుద్ధం చేయి. అంతేకాని పిరికిపందవు మాత్రం కాబోకు…

Also read: రజోగుణము మోహావేశపరమైనది

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles