Tuesday, January 21, 2025

శత్రువులని కూడా జయించే వీరుడు శ్రీకృష్ణుడు

శ్రీమాన్ కె ఇ నరసింహన్ ప్రవచనం

నన్ను నమ్మిన వారిని, వ్యతిరేకించే వారినీ కూడ జయించగలుడీ శ్రీ కృష్ణుడు. ఆశ్రయించిన వారికి నమస్కరిస్తే చాలు, కాని నీ దగ్గరికి రావడానికి వారిని అంటే ఆశ్రయించని శత్రులను జయించేవాడివి కదా శ్రీకృష్ణా అంటున్నారు గోపికలు, గోదమ్మ. నిన్ను ఆశ్రయించకుండా విమర్శించి, శిశుపాలుడు నిందించే వారి జయించి శిక్షించినప్పడకీ మోక్షం ఇచ్చిన వారిని అంటారు. శ్రీరామునిగా అవతరించి తన సత్యాన్నిఅనుసరిస్తూ చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకున్నాడు. సామ దాన భేద దండలన్నట్టుగా జయించినవారు శ్రీరామకృష్ణులు.

అరణ్యానికి వెళ్లిపోయే దశలో ఎంతో మందికి శ్రీరాముడు దానాలు చేసిపోయాడు. చివరికి మరొక బ్రాహ్మడు యాచించగా కర్రవిసిరితే ఎంత దూరంగా గోవుమందలందరినీ ఇచ్చి వేస్తానన్నాడు. నువ్వు అడగకపోయినా ఇవ్వడానికి సిధ్దంగా ఉన్నాను, అయినా యాచించకపోయినా అడిగినందని కన్న ఎక్కువ ఇస్తాను అనేవాడు.

Also read: దేవుడివైనా సరే బాధ్యత కర్మ వదలకూడదు

శివధనుర్బంగం చేసిన సందర్భంలో పరశురాముడు కోపిస్తాడు. శివుడు విష్ణువు ఇద్దరూ విశ్వకర్మ నిర్మించి ఇస్తారు. ఒకటి విరుస్తావా? నా దగ్గర హరిధనుస్సు ఉంది ఎక్కి బాణం విసిరి గలవా అని దశరథుడిని అవమానిస్తే రాముడికి తీవ్ర కోపం వచ్చినా ఓపికగా తన పరాక్రమం చూపిస్తాడు. నీవు చాలా గొప్ప బ్రాహ్మడైన వీరుడివి కనుక చంపవదిలేస్తాను. కాని నా ఎక్కిన బాణాన్ని వదిలబోను, నీకేమివ్వాలి అని ప్రశ్నిస్తాడు రాముడు. మొత్తం గెలచిన స్థలం అంతా కశ్యమునికి సమర్పిస్తాడు కనుక, నీ దగ్గర ఏంమిగిలింది అంటాడు. ఓడిపోయిన పరశురాముడు ఇన్నేళ్లూ చేసుకున్న తపోశక్తినంతా ధారాదత్తం చేస్తారు. అది రాముడి జయించిన గాధ.

శత్రువుడైన రావణాసురుని తమ్ముడు విభీషణుడు ఆశ్రయిస్తే అవును కాదు అనకుండా రక్షించమే కావడంతో పాటు లంకా నగరానికి పట్టాభిషేకం చేస్తాడు. అది సరే కాని, ఒకవేళ రావణాసురుడే ఆశ్రయించి సీతను సమర్పించి వెళ్లిపోతే శ్రీరాముడు ఏం చేసేవాడు? ఆ ప్రశ్నకు కూడా రాముడే రామాయణంలో సమాధానం ఇస్తాడు. రావణుడు ఆశ్రయించి వచ్చి ఉంటే ఆయనకు లంక ఇవ్వలేను, ఎందుకంటే అప్పడికే విభీషనుడికి లంక ఇచ్చి ఉంటాను కనుక అడిగితే రావణుడికి అయోధ్యను కూడా పట్టాభిషేకించి ఇచ్చేవాడిని అంటాడు.

Also read: తిరుమల జీయర్ మఠంలో మంగళాశాసన పాశురం

నిజానికి భీష్ముడు శత్రువై, శ్రీ కృష్ణుడి భక్తుడయినప్పడికీ చంపకుండా, ఎన్ని బాణాలు వేసి గాయాలు చేస్తూ ఉన్నా, ప్రతి సారీ భగవంతుడని నమస్కరిస్తున్నాడు కనుక కాపాడుతున్నాడు. వళ్లంతా బాణాలతో దెబ్బతింటున్నపుడు కోపించి, తనను బాణాలతో అర్చిస్తున్నాడని అంటూ ఆయుధం ధరించబోనన్న ప్రతిజ్ఞను వదడానికి కూడా సిద్ధమవుతాడు.  సింహమై విజృంభిస్తూ ఉంటే ఆయన సౌందర్యాన్ని ఆరాధన చేస్తున్నవాడు భీష్ముడు. నా పరువు బోతుంది అని అర్జునుడు బతిమాలుకుంటే యుద్దాన్నిఆపి మళ్లీ సారథ్యం స్వీకరిస్తారు.  ప్రతిసారీ గెలిచి పోయే శక్తి ఉన్నా భక్తులకోసం ఒక్కోసారి ఓడిపోతే పోతుందేమి అని శ్రీకృష్ణుడు అనుకుంటాడు.

ఈవిధంగా రకరకాలుగా విముఖులైన వారిని సుముఖులను చేసుకోవడానికి కావలసినంత మర్యాద, సౌశీల్యం నారాయణుడికి ఉందనే వివరాలన్నీ గోదాదేవి ఈ పాశురంలోని వివరిస్తారని టిటిడి వక్త, శ్రీమాన్కె ఇ లక్ష్మీనరసింహన్ అని ఇద్దరు తిరుమల శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములు తిరుమల జీయర్ మఠం లో తిరుప్పావై నిర్వహించిన ఈ 27వ పాశురంలో తనతో విభేదించి, కలిసి రాకుండా పోయే శత్రువులను జయించడమనేది ఒక పరాక్రమం, అది శ్రీకృష్ణుని కళ్యాణగుణ సంపదలని వివరించారు.

Also read: నరసింహుడికే సర్వవ్యాపకత్యం

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles