25గోదా గోవింద గీతం
ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరైప్పిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్
తెలుగు భావార్థ గీతిక
అర్ధరాత్రి ఓతల్లి కడుపు పంటయైపుట్టి, వెంటనే
యమున దాటి వ్రేపల్లెలో యశోద పట్టియైనట్టి కృష్ణా
నిన్నోర్వలేక పరిమార్చు కుట్రల దునుమి నావు
కంసుని గుండెలో భయమనెడు నిప్పు పెట్టి నావు
మాధవుని వేడి, పరము కోరెడు మా ప్రేమల కన్న
మాపై కన్నయ్య వ్యామోహమే మిన్నయని తెలిసినాము
పిరాట్టియైన కోరని సిరిని కోరి, నీ శౌర్యసౌశీల్యముల
కీర్తించి నీ వియోగదుఃఖము మాన్పగా వచ్చినాము.
ఒరుత్తి=ఒక తల్లికి, మగనాయ్ =పుత్రుడిగా, పిఱందు=జనించి, పుట్టిన రాత్రే, ఒరుత్తి=మరొక తల్లికి మగనాయ్ =కొడుకుగా, ఒళిత్తువళర= రహస్యంగా పెరుగుతున్న కాలంలో, త్తాన్=ఒక రాక్షసుడు, తరిక్కిలానాగి=సహించని వాడై, తీంగు నినైంద=కీడు తలపెట్టి కంజన్ = కంసుని యొక్క, కరుత్తై =దురాలోచనను, పిరైప్పిత్తు= భగ్నం చేసి, ఆతని వయిట్రిల్ = కడుపులో, నెరుప్పు నిన్ఱ = నిప్పై నిలిచిన, నెడుమాలే=సర్వాధికుడా ఉన్నై=నిన్ను, అరుత్తిత్తువందోమ్= అర్థించడానికి వచ్చినాము, పఱై తరుదియాగిల్ = మాకోరికను తీర్చేట్లయితే, తిరుత్తక్క శెల్వముమ్=శ్రీమహాలక్ష్మి కూడా కోరదగిన నీ ఐశ్వర్యాన్ని, సేవగముమ్ =నీ శౌర్యసౌశీల్య లక్షణాలను, యామ్ పాడి = మేము పాడి, స్తుతించి, వరుత్తముమ్ తీర్ న్దు= నిన్ను ఎడబాసిన దుఃఖము తొలగిపోగా, మగిఝిన్దు= సంతోషిస్తాము.
ఆ కంసుని గుండెల్లో నిప్పై కూర్చున్నాడు శ్రీకృష్ణుడు. అంతటి ఉద్రిక్త పరిస్థితులలో సైతం శత్రువులకు భీతి గొల్పుతూనే భక్తులకు ఆశ్రితులకు ఆనందం కలిగించే లీలలు చేసిన శ్రీకృష్ణుడి కి భక్తుల పట్ల తీవ్రమైన వ్యామోహం ఉందట. ఈ కష్టాలన్నీ స్వీకరించిందే భక్తుల కోసం. మాకోసం నీవు జన్మలెత్తాల్సిన పని లేదు. ఎక్కడికో రావలసిన అవసరం లేదు. మేమే నీకోసం వచ్చాము. మాకు ఇతర ప్రయోజనాలేవీ లేవు. మీ దర్శనం చాలు. మాకు నీవే కావాలి. అన్నారు గోపికలు.
శ్రీకృష్ణుడు: నా కోసం వచ్చానంటున్నారు, పఱై (డక్కి అనే వాయిద్య పరికరం) అడుగుతున్నారు ఏమిటిది?
గోపికలు: అన్నీ నీసంకల్పమే కదా. మేము అడిగినదివ్వాలి కాని మేము ఏమని అడగగలం. నీవు పఱై ఇస్తానంటున్నావు, తీసుకుంటాం. వద్దంటే మేమే స్వతంత్రించి నిర్ణయిస్తున్నామనుకుంటారు. కాని శ్రీ మహాలక్ష్మి కూడా అడిగేంతటి నీ ఐశ్యర్యాన్నినీ సౌశీల్య లక్షణాలను గానం చేస్తాం. నిన్ను ఎడబాసిన కష్టాలు తొలగినాయి. కంసుని భయానికి నీ పేరు చెప్పడానికీ వెనుకాడాం. ఇప్పుడా బాధ లేదు. నోరారా నీ నామాలను కీర్తిస్తాం. ఎంత భాగ్యం.
శ్రీకృష్ణుడు: ‘సరే ఇంక ఏంకావాలి’.
గోపికలు: “ఉన్నై అరుత్తిత్తు వందోం” మేం నిన్ను కోరి వచ్చాం. “పఱై” వ్రత పరికరాలు “తరుతియాగిల్” నీ విస్తానన్నావు కాబట్టి తీసుకుంటాం.
శ్రీకృష్ణుడు: పాపం మీరంతా ఎంతో శ్రమ పడి వచ్చారు కదా అయ్యో
Also read: రావణు గూల్చిన శ్రీరామ శౌర్యమునకు జయము జయము
గోపికలు: “తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్” లేదు మేం సంతోషంతో వచ్చాం. నీ నామం పాడుతూ వచ్చాం కదా, మాకు ఏ శ్రమా లేదు హాయిగా వచ్చాం.
Also read: సింహగతిలో సింహాసనం చేరినకృష్ణ సింహము