భగవద్గీత–101
అవే వంట దినుసులు. కొందరు గృహిణుల చేతిలోపడి అమృతంగా మారిపోతాయి, అదే పని.
కొందరు అతి తక్కువ సమయంలో అద్భుతంగా పూర్తిచేస్తారు. అదే రహదారి. కొందరు డ్రైవర్లు ఏ మాత్రం కుదుపులు లేకుండా, వళ్ళు అలవకుండా రాత్రంతా ప్రయాణం చేసినా మనకు అలసట కలుగనీయకుండా మనలను గమ్యస్థానాలకు చేరుస్తారు.
ఒకటే ఊరు. ఒకడు అందరికంటే ఎక్కువగా తనపొలంలో పంట పండిస్తాడు.
Also read: ఒత్తిడి లేని బతుకుకోసం భగవద్గీత!
ఒక వార్త ఈ మధ్య చూశాను. అమెరికాలో ఒక డ్రైవరుగారికి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. ఎందుకంటే… ఆయన తన వృత్తిలో భాగంగా రెండుకోట్ల కిలోమీటర్లు ఇప్పటిదాకా వాహనాలు నడిపారట. ఏ ఒక్క చిన్న సంఘటన కూడా లేని రికార్డు స్వంతం చేసుకున్నారట.
ఇదెలా సాధ్యం అని ఆయనను అడిగితే ఆయన ఒకటే సమాధానం ఇచ్చారట. `నేను వాహనం నడిపేటప్పుడు నా పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ నడుపుతాను` అని అన్నారు. ఈ జాగ్రత్తగా గమనించడాన్ని ఏమంటారు.
వీళ్ళంతా ఎవరు?
Also read: యుక్తాయుక్త విచక్షణ పరమావధి
పరమాత్మ ఇచ్చిన నిర్వచనం ప్రకారం యోగులు. శ్రేష్టమైన వారు. అందుకే నీవు యోగివికా అర్జునా. యోగీభవ అర్జునా అంటారాయన.
మరి పరమాత్మ ఇచ్చిన నిర్వచనం ఏమిటి?
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్
ఎవరైతే జీవితాన్నిశారీరిక మానసిక స్థాయినుండి బుద్ధివరకు పెంచగలరో వారు అభివృద్ధి చెందుతారు. బుద్ధి అంతాకూడా యోగంలోనే ఉండాలి. అప్పుడే సమర్ధవంతమైన నేర్పుతో కార్యాన్ని నిర్వహించగలరు. పనిలో సమర్ధతే యోగం.
Also read: అభ్యాసవైరాగ్యాలు