భగవద్గీత – 45
కృష్ణబిలాలు అని ఖగోళభౌతిక శాస్త్రంలో చెపుతారు. పెద్దపెద్ద నక్షత్రాలు పగిలి బద్దలయినప్పుడు అంతులేని ద్రవ్యరాశితో ఇవి ఏర్పడతాయి. వాటి గురుత్వాకర్షణ ఎంత ఎక్కువ అంటే, వీటిలోకి వెళ్ళిన ఏ వస్తువూ మరల తిరిగిరాదు చివరకు కాంతికూడా.
ఒక్కొక్క కృష్ణబిలం ఎన్నో లక్షల సూర్యుల ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. సాజిటేరియ అనే కృష్ణబిలం నలభైలక్షల సూర్యుల ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. కంటికి కనపడని X Rays సైగ్నస్ X-1 అనే కృష్ణబిలం నుండి వస్తాయని గుర్తించారు.
Also read: త్రిగుణాలకు అతీతంగా ఎదగాలి
ఆకాశంలో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నయి. మానవుడికి నిజానికి వాటి గురించి ఎక్కువ తెలవదు.
భూమి.
అదే, మనం నివాసం ఉండే ఈ భూగోళం కంటే 3,33,000 రెట్లు బరువయినవాడు మన సూర్యుడు. అలాంటి సూర్యులు నలభై లక్షలు, వాటి ద్రవ్యరాశి.. ఒక కృష్ణబిలం(బ్లాక్ హోల్). అలాంటి కృష్ణబిలాలు ఎన్నున్నాయో ఈ విశ్వంలో!
Also read: సత్వ గుణం గలవాడు యోగ్యుడు
అబ్బో, ఇదేం లెక్క .ఊహకే అందటంలేదు అంటారా? నిజమే ఊహకు అందదు. అక్కడ లోపటికి వెళ్ళిన ఏదీ తిరిగిరాదు. ఏదీ వెలుగదు. వీటన్నిటినీ సృష్టించిన శక్తిని మనము ‘‘బ్రహ్మము’’ అని అంటున్నాము.
అక్కడ మన సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఏవీ ప్రకాశించలేవు. అక్కడికి ఒక్కసారి చేరినదేదీ తిరిగిరాదు. అదే పరమపదం!
నతత్భాసయతే సూర్యః న శశాంకో న పావకః
యత్ గత్వా న నివర్తంతే తత్ ధామ పరమమ్ మమ
అక్కడ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్నికానీ ప్రకాశింపలేవు. అక్కడికి వెళ్ళినవేవీ మరల తిరిగిరావు.
భగవద్గీత లోని ASTROPHYSICS ఇది!
Also read: శ్రీవారి పాదకమల సేవాభాగ్యమే పరమావధి