కొప్పరపు సోదర కవులు తమ జీవితంలో జరిగిన ఒక ఘట్టాన్ని తీసుకొని ‘దైవసంకల్పం’ పేరుతో అద్భుతమైన కావ్యంగా మలిచారు.
కొప్పరపు కవులకు శిష్యప్రాయుడు, ప్రసిద్ధ పండితుడు కీర్తిశేషులు మిన్నికంటి గురునాథశర్మగారు గతంలో (1963ప్రాంతం) ‘కొప్పరపు కవి పరిచయం’ శీర్షికతో కొప్పరపు కవులపై వెలువరించిన ఒక పుస్తకానికి ముందుమాట రాశారు. అందులో ఈ కావ్యం గురించి ప్రస్తావించారు. వారు చెప్పినదానిని బట్టి 1913కు లోపే ఈ కావ్యం నిర్మాణమై వుంది. స్వయంగా కొప్పరపు కవులు ఆ కావ్యంలోని పద్యాలను చదువుతుండగా అనేక పర్యాయాలు వినే సౌభాగ్యం దక్కిందని ఆయన వివరించారు.
దైవసంకల్పంతో పాటు, కుశలవ నాటకం (సాధ్వీ మాహాత్మ్యం), శ్రీకృష్ణ కరుణా ప్రభావం కావ్యాలు కూడా అప్పటికే నిర్మాణమయ్యాయని, ఆ పద్యాలు కూడా కొప్పరపు గళద్వయం నుండి వినే అదృష్టం తనకు కలిగిందని మిన్నికంటివారు తెలిపారు. సుమారు 110 ఏళ్ళనాటి కొప్పరపు కవుల ‘దైవసంకల్పం’ కావ్యం ఈ రోజు మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రతిపదార్ధ తాత్పర్య సహితంగా ప్రచురించాము. ఇది రెండవ ప్రచురణ. మొదటి ప్రచురణ 2010లో చేశాము. ప్రఖ్యాత అవధాని మాడుగుల నాగఫణిశర్మగారు ఈ కావ్యానికి సరళ సుందరమైన ప్రతిపదార్ధ, తాత్పర్య, విశేషాలతో కూడిన వ్యాఖ్య రాశారు.
‘మహామహోపాధ్యాయ’ డాక్టర్ శలాక రఘునాథశర్మగారు అద్భుతమైన ‘కావ్య పరిచయం’ చేశారు. కొప్పరపు కవులు అవధాన కవులుగా, ఆశుకావ్య నిర్మాతలుగా సుప్రసిద్ధులు. వారు రచించిన కావ్యం ఎలా వుంటుందో తెలుసుకోడానికి ఈ కావ్యం ఉపయోగపడుతుంది. వారు రచించిన మహాకావ్యాలన్నీ (పరిమాణంలో,శిల్పంలో, కథా వస్తువులో,కల్పనలో) అందుబాటులోకి వచ్చివుండి వుంటే పద్యప్రియుల పంట మరెంతగానో పండేది.
ఈ అలఘుకావ్యం వారి ప్రతిభాప్రపంచ దర్శనానికి చిరుదర్పణం మాత్రమే. ఈ కావ్యాన్ని ప్రచురించడం అక్షర తర్పణంగా భావిస్తున్నాను.
ఈ పుస్తకం మార్కెట్ లోకి కూడా అందుబాటులో వస్తోంది.
ప్రతులు కావాల్సినవారు ఈ నెంబర్స్ లో సంప్రదించవచ్చు.
పంపిణీ బాధ్యతలు పూర్తిగా వారికి అప్పజెప్పాను. రాఘవేంద్ర పబ్లికేషన్స్ :
94948 75959
94938 75959,
94928 75959
గమనిక: ప్రస్తుతం కొన్ని కాపీస్ మాత్రమే అందుబాటులో వున్నాయి.త్వరలో మరిన్ని కాపీస్ అందుబాటులోకి వస్తాయి.
ధర : 200 రూపాయలు + పంపిణీ చార్జీలు అదనం
స్వయంగా పుస్తకం కొనుక్కొని సొంతం చేసుకోవాలనుకొనేవారు, కొన్ని కాపీస్ కొనుక్కొని ఎవరికైనా gift గా ఇవ్వాలనుకొనేవారు పైన ఇచ్చిన నెంబర్స్ లో కాంటాక్ట్ చెయ్యవచ్చు.ఈ పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చే మొత్తం మళ్ళీ కొప్పరపు కవుల పుస్తకాల ప్రచురణకే అంకితం చేస్తాము. ఇందులో ఎటువంటి వ్యాపార దృక్పథం లేదు. పుస్తకాలు పంపిణీ చేసే వ్యవస్థ నా దగ్గర లేకపోవడం వల్ల వేరే Distributor కు అప్పజెప్పాను. కొప్పరపు కవుల సాహిత్యం ప్రపంచానికి చేరువ చెయ్యాలన్నదే ఏకైక సంకల్పం.
–మాశర్మ