- రవీంద్ర నివాసానికి భారీగా చేరుకున్న శ్రేణులు
- అరెస్టును ఖండించిన చంద్రబాబు
మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరయింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఈ రోజు ఉదయం మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు.పురపాలక ఎన్నికల సందర్భంగా నిన్న (మార్చి 10) కొల్లు రవీంద్రకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎన్నికల విధులకు ఆటంకం కలింగించారన్న అభియోగంపై 356,506,188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రోజు ఉదయం మచిలీపట్నంలోని ఆయన నివాసంలో రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం జిల్లా కోర్టుకు తరలించారు. కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీంద్ర నివాసానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చెలరేగకుండా ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. అయితే కోర్టులో విచారణ అనంతరం కోర్టు కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: విజయవాడ తెలుగు తమ్ముళ్ల మధ్య సమసిన వివాదం
అరెస్టును ఖండించిన చంద్రబాబు:
అంతకు ముందు కొల్లు రవీంద్ర పోలీసులు అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలను అరెస్టుచేస్తూ ప్రభుత్వం భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న చంద్రబాబు, ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేకి అని పండగ రోజు కూడా సంతోషంగా ఉండనివ్వడం లేదంటూ మండిపడ్డారు. రవీంద్ర అరెస్టుపై పలువురు టీడీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు అక్రమ అరెస్టులు చేయిస్తోందని టీడీపీ నేత పట్టాబిరామ్ విమర్శించారు.
Also Read: విశాఖలో టీడీపీకి ఎదురుదెబ్బ