- టెస్టుల్లో కొహ్లీ 51వ అర్థశతకం
- 119 అర్థశతకాలతో సచిన్ టాప్
టెస్టు క్రికెట్లో అత్యధిక అర్థశతకాలు బాదిన భారత క్రికెటర్ల వరుస 7వ స్థానంలో కెప్టెన్ విరాట్ కొహ్లీ నిలిచాడు. చెపాక్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన తొలిటెస్టు ఆఖరిరోజు ఆటలో విరాట్ కొహ్లీ 72 పరుగుల స్కోరు సాధించడం ద్వారా తన కెరియర్ లో 51వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న 51 అర్థశతకాల రికార్డును కొహ్లీ సమం చేశాడు.
Also Read: కెప్టెన్ గా విరాట్ కొహ్లీ స్టయిలే అంత…!
భారత క్రికెటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ 119 అర్థశతకాలతో అగ్రస్థానంలో ఉండగా రాహుల్ ద్రావిడ్ 99, సునీల్ గవాస్కర్ 79, వీవీఎస్ లక్ష్మణ్ 73, వీరేంద్ర సెహ్వాగ్ 54, దిలీప్ వెంగ్ సర్కార్ 53 హాఫ్ సెంచరీలతో మొదటి ఆరుస్థానాల్లో కొనసాగుతున్నారు. సౌరవ్ గంగూలీ, విరాట్ కొహ్లీ చెరో 51 అర్థశతకాలతో సంయుక్త 7వ స్థానంలో నిలిచారు. భారత కెప్టెన్ గా విరాట్ కొహ్లీకి ఇది 24వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.