తెలంగాణ జనసమితి పార్టీ నాలుగేళ్ళ ప్రస్థానానికి ముగింపు పలకనున్న కోదండరామ్. రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఓర్పుగా నేర్పుగా ముందుకు నడిపించిన ఐక్య వేదిక నాయకుడు రాజకీయ పార్టీ ని నడిపించలేక పోయారు. జాతీయ పార్టీ ఆహ్వానాన్ని వదులుకున్న ప్రొఫెసర్ ఉత్తరాది పార్టీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
అసలే కేంద్ర పాలకులు దక్షిణాదిపై వివక్ష చూపుతున్నారనే బలమైన అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో ఒక ఉత్తరాది పార్టీలో విలీనానికి సంసిద్ధం కావడం ప్రొఫసర్ గారు తీసుకుంటున్న నిర్ణయం సరైనదేనా అనే చర్చ తెలంగాణ మేధావుల వర్గంలో జరుగుతున్నది. ఇప్పుడున్న పార్టీలలో విలువలకు ప్రాధాన్యమిచ్చే పార్టీగా, పరిపాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్న నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో పని చేయడం నయమని కోదండ్ రామ్ అనుకొని ఉంటారు.