తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం నీటి విడుదల చేయడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. గురువారం కిషన్ రెడ్డి విలేకర్ల తో మాట్లాడారు. ఏపీ ది దుందుడుకు చర్యగా ఆయన అభివర్ణించారు. సాగు నీటి విడుదలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. ఐతే నీటి విడుదలలో కేంద్రంతో సంప్రదించి ఉంటే సబబుగా ఉండేదని అయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అధికారులతో చర్చించి నీటి విడుదల చేసివుంటే ఆమోదంగా ఉండేదని అయన అన్నారు. నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటే వివాదాలు రావన్నారు. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల చేయడం సమంజసం కాదన్నారు. చర్చలు జరగకుండా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల అయన అసంతృప్తి వ్యకం చేసారు. ఏకపక్షంగా ఏపీ నిర్ణయం తీసుకోవడం సహేతుకంగా లేదన్నారు.